Fergus Wilson
-
తొలి టి20 న్యూజిలాండ్‌దే
ఆక్లాండ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో) విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (37 బంతుల్లో 75 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఫాబియాన్ అలెన్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రూ ఫ్లెచర్ (14 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లాకీ ఫెర్గూసన్ (5/21) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం వర్షం కారణంగా కివీస్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 176గా నిర్దేశించారు. అరంగేట్ర ఆటగాడు డెవాన్ కాన్వే (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జిమ్మీ నీషమ్ (24 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్ సాన్‌ట్నర్ (18 బంతుల్లో 31 నాటౌట్; 3 సిక్సర్లు) చివర్లో విజృంభించడంతో న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసి గెలుపొందింది. -
భారతీయులకు ఇళ్లను అద్దెకివ్వను!
లండన్: భారత్, పాకిస్తాన్ జాతీయులకు తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని బ్రిటిష్ సంపన్నుడు ఫెర్గూస్ విల్సన్ చెబుతున్నాడు. దీనిపై వివాదం రేగినా, న్యాయపర చర్యలు తీసుకునే అవకాశమున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ‘వారు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుంది. మళ్లీ కార్పెట్లు వేయడానికి ఖర్చవుతుంది..అందుకే వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వను. ఇది వారి శరీర వర్ణానికి సంబంధించిన సమస్య కాదు, కూర(కర్రీ)కు సంబంధించిన సమస్య..’ అని వాదిస్తున్నాడు. వెయ్యికిపైగా ఇళ్లున్న ఫెర్గూస్ భారతీయులపై విధించిన ఈ నిషేధాన్ని బ్రిటన్ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఈహెచ్ఆర్సీ) కోర్టులో సవాలు చేసింది. విల్సన్ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టును కోరామని సంస్థ ప్రతినిధి రెబెక్కా హిల్సెన్‌రథ్ తెలిపారు. భారత్, పాక్ జాతీయులకు ఇళ్లను కిరాయి ఇవ్వొద్దంటూ ఫెర్గూస్ తన ఏజెంట్లకు పంపిన ఈమెయిల్స్ లీక్ కావడంతో వివాదం రేగింది.