IPL 2023: పంజాబ్‌దే పైచేయి | IPL 2023: Punjab Kings beat Kolkata Knight Riders by seven runs | Sakshi
Sakshi News home page

IPL 2023: పంజాబ్‌దే పైచేయి

Published Sun, Apr 2 2023 4:15 AM | Last Updated on Sun, Apr 2 2023 7:13 AM

IPL 2023: Punjab Kings beat Kolkata Knight Riders by seven runs - Sakshi

మొహాలి: సొంతగడ్డపై పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం చేసింది. ఐపీఎల్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో భాగంగా శనివారం మాజీ చాంdపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు కీలక వికెట్లతో పంజాబ్‌ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/19)కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రాజపక్స (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరిపించగా... శిఖర్‌ ధావన్‌ (29 బంతుల్లో 40; 6 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్‌ (12 బంతుల్లో 23;  2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక మైదానంలో ఫ్లడ్‌లైట్‌లు మొరాయించడంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌ అరగంట ఆలస్యంగా మొదలైంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో భారీ వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో ఆట సాధ్యపడలేదు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 16 ఓవర్ల వరకు కోల్‌కతా విజయ సమీకరణం 154 పరుగులుగా ఉంది. 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కోల్‌కతాను రసెల్‌ (19 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (28 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించడంతో గెలుపుపై కోల్‌కతా ఆశలు పెంచుకుంది. అయితే వీరిద్దరిని వరుస ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు పెవిలియన్‌ పంపించడం, ఆ వెంటనే వర్షం రావడంతో కోల్‌కతాకు నిరాశ తప్పలేదు.  

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) గుర్బాజ్‌ (బి) సౌతీ 23; శిఖర్‌ ధావన్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 40; రాజపక్స (సి) రింకూ సింగ్‌ (బి) ఉమేశ్‌ 50; జితేశ్‌ శర్మ (సి) ఉమేశ్‌ (బి) సౌతీ 21; సికందర్‌ రజా (సి) నితీశ్‌ రాణా (బి) నరైన్‌ 16; స్యామ్‌ కరన్‌ (నాటౌట్‌) 26; షారుఖ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191.
వికెట్ల పతనం: 1–23, 2–109, 3–135, 4–143, 5–168.
బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4–0–27–1, సౌతీ 4–0–54–2, సునీల్‌ నరైన్‌ 4–0–40–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–26–1, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–43–0.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: మన్‌దీప్‌ సింగ్‌ (సి) స్యామ్‌ కరన్‌ (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 2; గుర్బాజ్‌ (బి) ఎలిస్‌ 22; అనుకూల్‌ రాయ్‌ (సి) సికందర్‌ రజా (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 4; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) రాహుల్‌ చహర్‌ (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 34; నితీశ్‌ రాణా (సి) రాహుల్‌ చహర్‌ (బి) సికందర్‌ రజా 24; రింకూ సింగ్‌ (సి) సికందర్‌ రజా (బి) రాహుల్‌ చహర్‌ 4; ఆండ్రీ రసెల్‌ (సి) సికందర్‌ రజా (బి) స్యామ్‌ కరన్‌ 35; శార్దుల్‌ ఠాకూర్‌ (నాటౌట్‌) 8; సునీల్‌ నరైన్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16 ఓవర్లలో 7 వికెట్లకు) 146.
వికెట్ల పతనం: 1–13, 2–17, 3–29, 4–75, 5–80, 6–130, 7–138.
బౌలింగ్‌: స్యామ్‌ కరన్‌ 3–0–38–1, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 3–0–19–3, ఎలిస్‌ 3–0–27–1, సికందర్‌ రజా 3–0–25–1, రిషి ధావన్‌ 1–0–15–0, రాహుల్‌ చహర్‌ 2–0–12–1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 1–0–7–0.

ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్‌ X రాజస్తాన్‌ (మ. గం. 3:30 నుంచి)
బెంగళూరు X ముంబై (రాత్రి గం. 7:30 నుంచి )
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement