
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ దిగ్గజం రషీద్ ఖాన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 క్రికెటర్ బిలాల్ సమీకి రషీద్ ఆర్థిక సహాయాన్ని అందించాడు. కాగా సమీ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఆఫ్ఘాన్ జట్టులో భాగమై ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన తర్వాత సమీ తన బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి రషీద్ ఆర్థిక సహాయం చేశాడు.
"అండర్-19 ఆటగాడు బిలాల్ సమీకి ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి ఆర్థిక సహాయం చేసిన రషీద్ ఖాన్ ధన్యవాదాలు. రషీద్ తన సహాయంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు" అని ఇబ్రహీం మొమండ్ అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు. కాగా రషీద్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్- 2022 మెగా వేలానికి ముందు రషీద్ ఖాన్‌ను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది.
చదవండి: IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్
Comments
Please login to add a commentAdd a comment