under 19 cricket team
-
కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్
India Under 19 Captain Vijay Zol: భారత అండర్-19 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ జోల్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. జోల్‌తో పాటు అతని సోదరడు విక్రమ్ జోల్, మరో 18 మంది తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి, దోపిడి చేసినట్లు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఒకరు మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విజయ్ జోల్, విక్రమ్ జోల్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు సదరు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌పై కూడా ఓ వ్యక్తి (ఈ కేసులో నిందితుల్లో ఒకరు) ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట సదరు మేనేజర్ తమను లక్షల మేర మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అతనిపై సైతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Yuvi pa!thanks for ua motivating words!will surely keep them in mind and keep working hard!thanks again!@YUVSTRONG12 pic.twitter.com/ikM0NimC25 — Vijay Zol (@vhzol) December 24, 2014 కాగా, 2014లో భారత అండర్-19 టీమ్ కెప్టెన్‌గా ఎంపికైన 28 ఏళ్ల విజయ్ జోల్.. మహారాష్ట్ర, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (యూత్ కాంట్రాక్ట్) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో జరిగిన అండర్-19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో జోల్ 467 బంతుల్లో 53 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 451 పరుగులు చేశాడు. Wid Abraham De Villiers!☺️@ABdeVilliers17 @mstarc56 u spoiled it Mitchyy.!😄 pic.twitter.com/K03PMO6qZ3 — Vijay Zol (@vhzol) May 23, 2014 ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్‌గా ఉంది. జోల్.. 2010 విజయ్ మర్చంట్ టోర్నీలోనూ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ సహచరుడైన జోల్.. అంతర్జాతీయ స్థాయిలో సరైన అవకాశాలు రాక దేశవాలీ టోర్నీలకే పరిమితమయ్యాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 11 మ్యాచ్‌లు ఆడిన జోల్.. 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీల సాయంతో 47.50 సగటున 965 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 200 నాటౌట్‌గా ఉంది. -
స్వదేశంలో యశ్ ధుల్ సేనకు ఘన స్వాగతం.. ఉబ్బి తబ్బిబ్బయిన యువ క్రికెటర్లు
U19 World Cup 2022: అండర్ 19 ప్రపంచకప్ 2022 టైటిల్ కైవసం చేసుకున్న యువ భారత జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణాంతరం యశ్ ధుల్ సేన ఇవాళ ఉదయం బెంగళూరుకు రీచ్ అయ్యింది. యువ ఛాంపియన్లు సొంతగడ్డపై ల్యాండ్ కాగానే అభిమానుల అరుపులు, కేరింతలతో విమానాశ్రయం హోరెత్తాంది. అభిమానుల ఆదరణ చూసి టీమిండియా క్రికెటర్లు ఉబ్బితబ్బి బ్బి పోయారు. భారత యువ జట్టు బుధవారం బీసీసీఐ ఏర్పాటు చేసిన సన్మాన వేడుక కోసం బెంగళూరు నుంచి నేరుగా అహ్మదాబాద్‌కు వెళ్లనుంది. కాగా, గడిచిన ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ టైటిల్ పోరులో యంగ్ ఇండియా.. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదో సారి ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 2 బంతులు మిగిలుండగానే చేధించింది. నిషాంత్ సింధు(50 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చగా.. షేక్ రషీద్(50), రాజ్ బవా(35) రాణించారు. అంతకుముందు యంగ్ ఇండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చదవండి: మెగావేలానికి మరో నాలుగు రోజులే.. జేసన్ రాయ్ విధ్వంసం -
రషీద్ ఖాన్ మంచి మనసు.. యంగ్ బౌలర్‌కి ఆర్థిక సాయం!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ దిగ్గజం రషీద్ ఖాన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 క్రికెటర్ బిలాల్ సమీకి రషీద్ ఆర్థిక సహాయాన్ని అందించాడు. కాగా సమీ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఆఫ్ఘాన్ జట్టులో భాగమై ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన తర్వాత సమీ తన బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి రషీద్ ఆర్థిక సహాయం చేశాడు. "అండర్-19 ఆటగాడు బిలాల్ సమీకి ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి ఆర్థిక సహాయం చేసిన రషీద్ ఖాన్ ధన్యవాదాలు. రషీద్ తన సహాయంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు" అని ఇబ్రహీం మొమండ్ అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు. కాగా రషీద్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్- 2022 మెగా వేలానికి ముందు రషీద్ ఖాన్‌ను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. చదవండి: IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్ -
యువ సారథులు ఇద్దరూ ఇద్దరే !
-
టీమిండియాలో స్థానమే లక్ష్యం
పశ్చిమగోదావరి, ఉండి: టీమిండియాలో స్థానమే తన లక్ష్యమని అండర్–19 భారత క్రికెట్ జట్టు సభ్యుడు నంబూరి ఠాగూర్ తిలక్‌వర్మ అన్నారు. మండలంలోని వాండ్రం గ్రామానికి తన తల్లిదండ్రులు నంబూరి నాగరాజు, గాయత్రీదేవి, సోదరుడు తరుణ్వర్మతో కలసి శుక్రవారం వచ్చిన సందర్భంగా గ్రామ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు తిలక్‌వర్మను సాదరంగా సత్కరించారు. ఆయనతో కలసి ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం గ్రామానికి చెందిన అమ్మమ్మ భూపతిరాజు సుందరమ్మ, తాతయ్య సుబ్బరాజును ఆత్మీయంగా హత్తుకుని వారి దీవెనలు తీసుకున్నారు. అనంతరం తిలక్‌వర్మ మాట్లాడుతూ తాను 10 ఏళ్ల క్రితం అమ్మమ్మ గ్రామం వాండ్రం వచ్చినట్లు తెలిపారు. మళ్లీ ఇంత కాలానికి అమ్మమ్మ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మమ్మ, తాతయ్యలను చూసేందుకే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో తనను సత్కరించిన గ్రామ ప్రముఖులు, పెద్దలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫైనల్లో ఓటమి బాధించింది దక్షిణాఫ్రికాలో ఈ నెల 9న జరిగిన అండర్–19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో భారత జట్టు ఓటమి తనను చాలా బాధించిందని అన్నారు. మరికొంత మెరుగ్గా ఆడితే బాగుండేదని అనిపించిందన్నారు. భవిష్యత్‌లో భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదగాలనేదే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని అన్నారు. తనకు హైదరాబాద్‌లో మంచి శిక్షణ లభించిందని, బ్యాట్స్‌మెన్‌గా తాను మరింతగా రాణించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. తన తల్లిదండ్రులు నంబూరి నాగరాజు, గాయత్రీదేవి, సోదరుడు తరుణ్‌వర్మ ప్రోత్సాహంతోనే తాను ఇంతటి వాడిని అయ్యానని అన్నారు. తాను సాధించింది చాలా తక్కువని, భవిష్యత్‌లో సాధించాల్సింది చాలా ఉందన్నారు. తన ఆటను మెరుగుపరుచుకునేందుకు సీనియర్లు, క్రీడా ప్రముఖులు, రిటైర్డ్ ప్లేయర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తిలక్‌వర్మ తెలిపారు. తిలక్‌వర్మతో తల్లిదండ్రులు నంబూరి నాగరాజు, గాయత్రీదేవి, సోదరుడు తరుణ్‌వర్మ మావుళ్లమ్మ దర్శనం అనంతరం గ్రామంలోని శివాలయంలో తిలక్‌వర్మ పూజలు నిర్వహించారు. అనంతరం భీమవరంలోని మావుళ్లమ్మ, జంగారెడ్డిగూడెంలో మద్ది ఆంజనేయస్వామి దర్శనార్ధం తిలక్‌వర్మ తన కుటుంబసభ్యులతో పయనమై వెళ్లారు. గ్రామ ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ దాసరి కృష్ణ, మాజీ సర్పంచ్ గడి గోవిందరావు, కందుల బలరామకృష్ణ, రెడ్డిపల్లి సత్యనారాయణ, గులిపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఐసీసీ చర్యలు తీసుకుంటుంది
పాచెఫ్‌స్ట్రూమ్: అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ కుర్రాళ్ల శ్రుతిమించిన అతి ఉత్సాహంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంటుందని యువ భారత జట్టు మేనేజర్ అనిల్ పటేల్ తెలిపారు. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ గ్రేమ్ లెబ్రూయ్ స్వయంగా తన వద్దకు వచ్చి చెప్పారని ఆయన అన్నారు. ‘నిజానికి అసలేం జరిగింది మాకు కచ్చితంగా తెలియదు. కానీ అంతా నిర్ఘాంతపోయారు. ఆఖరు నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై ఐసీసీ అధికారులు ఆరా తీస్తారు. ఇందు కోసం వీడియో ఫుటేజీలు పరిశీలిస్తారు’ అని అనిల్ తెలిపారు. మ్యాచ్ ముగియగానే బంగ్లా కుర్రాళ్ల ఆనందం, వెర్రి తలకెక్కింది. ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చి భారత ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకొని విపరీత ధోరణిలో ప్రవర్తించారు. పేసర్ షరీఫుల్ ఇస్లామ్ అయితే అందరికంటే అతి ఎక్కువ చేశాడు. భారత ఆటగాళ్లకు మరీ దగ్గరగా వచ్చి అనుచిత సంజ్ఞలు చేశాడు. మ్యాచ్ జరిగే సమయంలోనూ షరీఫుల్ బంతి సంధించిన ప్రతీసారి స్లెడ్జింగ్‌కు పాల్పడటం టీవీ కామెంటేటర్లను విస్మయానికి గురిచేసింది. భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనపై అసంతృప్తి వెలిబుచ్చా డు. ‘గెలుపోటములు సహజం. ఆటలో భాగమే. కానీ సంబరమైనా, బాధయినా మనం నియంత్రించుకోవాలి. మరీ ఇంత చెత్తగా స్పందించకూడదు. అతి చేష్టలకు పాల్పడకూడదు’ అని అన్నాడు. బంగ్లా సారథి అక్బర్ అలీ కూడా తమ ఆటగాళ్లు మరీ అంత అతిగా స్పందించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. -
అరంగేట్రం తర్వాత మళ్లీ జూనియర్ జట్టులోకి!
కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ తరఫున అరంగేట్రం చేసిన నసీమ్ షా మళ్లీ జూనియర్ జట్టులో సైతం చోటు దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగనున్న అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్ జట్టు తమ జట్టును ప్రకటించింది. ఇందులో 16 ఏళ్ల నసీమ్ షాను ఎంపిక చేశారు. ఈ మేరకు పీసీబీ జూనియర్ నేషన్ సెలక్షన్ కమిటీ శుక్రవారం 15 మందితో కూడిన పాక్ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో నసీమ్ షాను ఎంపిక చేస్తూ పాక్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నసీమ్ షా కేవలం తొలి టెస్టులో మాత్రమే ఆడి వికెట్ సాధించాడు. 154 పరుగులు సాధించిన డేవిడ్ వార్నర్‌ను ఎట్టకేలకు నసీమ్ షా ఔట్ చేశాడు. గతేడాది ఏసీసీ అండర్-19 ఆసియా కప్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహైల్ నజీర్‌ను అండర్-19 వరల్డ్‌కప్‌కు సైతం సారథిగా నియమించారు. పాక్ ప్రకటించిన జట్టులో ముగ్గురు ఓపెనర్లు, ముగ్గురు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు, ఒక వికెట్ కీపర్, ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అండర్-19 వరల్డ్‌కప్‌లో 2004, 2006ల్లో విజేతగా నిలిచిన పాకిస్తాన్.. ఈ మెగా టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో స్కాట్లాండ్తో తలపడనుంది. -
సెమీస్‌లో యువ భారత్
సవర్ (బంగ్లాదేశ్): అండర్–19 ఆసియా కప్‌లో యువ భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (93 బంతుల్లో 92; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోని (66 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. 14 పరుగులకే 3 వికెట్లు్ల కోల్పోయిన యువ భారత్‌ను యశస్వి ఆదుకున్నాడు. సిమ్రన్ సింగ్(17)తో నాలుగో వికెట్‌కు 62 పరుగులు, ఆయుశ్ బదోనితో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా, కైస్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 45.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రియాజ్ హుస్సేన్ (92 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్), రహ్మానుల్లా గుర్బాజ్ (30 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. సిద్ధార్థ్ దేశాయ్ (4/37), హర్‡్ష త్యాగి (3/40), సమీర్ చౌదరి (2/18) ఆకట్టుకున్నారు. యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో శ్రీలంకతో అఫ్గానిస్తాన్ తలపడతాయి. -
గల్లీ కుర్రోడు.. దుమ్మురేపాడు
ఎక్కడో మారుమూల గల్లీలో బ్యాట్, బాల్‌తో క్రికెట్లో ఓనమాలు దిద్దిన పేదింటి కుర్రోడు అండర్–19 జట్టు తలుపు తట్టాడు. అంచెలంచెలుగా ప్రతిభకు పదును పెట్టుకుంటూ సెలెక్టర్ల దృష్టికి తనవైపు తిప్పుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించే బంతులు విసురుతూ.. అంతే వేగంగా రంజీ జట్టు వైపు దూసుకెళ్లాడు. ఇప్పటికే అనేక పతకాల పంట పండించి నేపాల్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అతడే తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన సాంబయ్య. పొన్నెకల్లు(తాడికొండ): మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన యువకుడు షేక్ సాంబయ్య అండర్– 19 విభాగంలో భారత జట్టు తరఫున బరిలో దిగేందుకు అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. తండ్రి షేక్ సర్దార్ వృత్తిరీత్యా నవారు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పొన్నెకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న విద్యార్థికి జిల్లా స్థాయిలో పాల్గొనే అవకాశం లభించింది. అవకాశాన్ని ఒడిసిపట్టుకొని తనలోని టాలెంట్‌ను నిరూపించుకోవడంతో బౌలర్‌గా మంచి ప్రతిభ కనబరుస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా రాణించడంతో సాంబయ్యకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 16వ తేదీన నేపాల్‌లో జరిగే ఇండో నేపాల్ సిరీస్‌లో విద్యార్థి పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 4 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో సాంబయ్య కూడా ఉండటం విశేషం. గతంలో సాధించిన విజయాలివే.. ♦ 2016 జూన్ 14న అండర్–16 విభాగంలో జిల్లా జట్టు తరఫున జిల్లా చాంపియన్‌షిప్ పోటీలలో పశ్చిమ గోదావరి జట్టుపై 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించాడు. ♦ 2016 జూన్ కడపలో జరిగిన జిల్లా చాంపియన్ షిప్ పోటీలలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ♦ 2017 ఆగస్టు కోల్‌కత్తాలో జరిగిన మ్యాచ్‌లో విదర్భ జట్టుపై నాలుగు వికెట్లు పడగొట్టాడు. కోచ్‌ల సహకారంతోనే.. నాలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన కోచ్‌లు అనీల్, మస్తాన్ రెడ్డి, బాల కిషోర్ చౌదరిలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఉత్తమ శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచాలనే లక్ష్యం. ఈ నెల 16వ తేదీన నేపాల్‌లో జరిగే టోర్నీకి సిద్ధమవుతున్నాను.– షేక్ సాంబయ్య, పొన్నెకల్లు. -
భారత జట్టులో అజయ్‌దేవ్
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరగబోయే అండర్–19 వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ ప్లేయర్ అజయ్‌దేవ్ గౌడ్ ఎంపికయ్యాడు. బెంగళూరులో గురువారం సమావేశమైన అఖిల భారత జూనియర్ సెలక్షన్ కమిటీ అండర్–19 వన్డే, నాలుగు రోజుల మ్యాచ్ జట్లను ప్రకటించింది. 2017–18 సీజన్ జాతీయ అండర్–19 టోర్నీ కూచ్ బెహర్ ట్రోఫీలో అజయ్ మీడియం పేస్ బౌలింగ్‌తో 33 వికెట్లు పడగొట్టాడు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఆర్యన్ జుయాల్ (యూపీసీఏ), నాలుగు రోజుల మ్యాచ్ జట్టుకు అనూజ్ రావత్ (డీడీసీఏ) సారథిగా ఎంపికయ్యారు. డబ్ల్యూవీ రామన్ ఈ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. జూలై 11 నుంచి ఆగస్టు 11 వరకు శ్రీలంకలో అండర్–19 భారత జట్లు పర్యటిస్తాయి. ఈ పర్యటనలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు, 5 వన్డే మ్యాచ్‌లు ఆడతాయి. -
అచ్యుతరావు @ ఆల్ రౌండర్
కడియం (రాజమహేంద్రవరం రూరల్): కడియం పరిసర ప్రాంతాల్లోని నర్సరీ రంగం అనేక మంది వలస కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. అందుకోసం జిల్లాలు దాటి ఇక్కడికి వేలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. అలా స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చిన బర్ల అచ్యుతరావు క్రికెట్లో తన నైపుణ్యంతో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. అండర్–19 విభాగంలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి 14 వరకు జరిగే మ్యాచ్‌కు 15 మంది ప్రాబబుల్స్‌లో ఎంపికయ్యారు. ఫస్ట్ ఆల్ రౌండర్‌గా ఎంపిక కావడంతో తుది జట్టులో తాను తప్పకుండా ఉంటానని ఆత్మస్థైర్యంతో చెబుతున్నాడీ పిడుగు. అచ్యుతరావు నేపథ్యమిదీ.. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన బర్ల సాంబయ్య, పోలమ్మల కుమారుడు అచ్యుతరావు. పార్వతీపురం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అనంతరం ఉపాధి నిమిత్తం తల్లిదండ్రులు కడియం మండలం బుర్రిలంక చేరుకుని ఇక్కడే నర్సరీల్లో పని చేస్తున్నారు. 6వ తరగతి నుంచి కడియపులంక హైస్కూల్లో చదువుకున్నాడు. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పార్వతీపురంలో రాజశేఖర్ అనే కోచ్ అచ్యుతరావులోని క్రికెట్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించగా, కడియపులంకలో పీఈటీ జయకుమార్ స్వయంగా టోర్నమెంట్లకు తీసుకువెళ్లి తనలో ఉన్న ప్రతిభను వెలికితీశారని అచ్యుతరావు తెలిపారు. రాజీవ్‌గాంధీ కళాశాలలో మహేంద్ర, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల కోచ్ ఎం.రాజశేఖర్‌లు తన ఆటకు మరింత మెరుగులు దిద్దారన్నారు. దాతల సాయం కోసం అచ్యుతరావుది క్రికెట్లో ఆల్ రౌండ్ ప్రతిభ అని, అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని కోచ్‌లు చెబుతున్నారు. గుంటూరులో జరిగిన స్టేట్ లెవెల్ సెలక్షన్స్‌లో ఫస్ట్ ఆల్ రౌండర్‌గానే తుదిజట్టుకు ఎంపిక చేశారు. అనంతరం డయ్యూ, డామన్‌లో నిర్వహించిన నేషనల్స్‌లో అచ్యుతరావు చూపిన ప్రతిభ ఆధారంగా అండర్–19 ప్రాబబుల్స్‌లో నిలిచాడు. బంగ్లాదేశ్ వెళ్లేందుకు సుమారు ఎనభైవేల రూపాయలు అవసరం కానున్న నేపథ్యంలో దాతలు సాయం అందిస్తే మరింత ముందుకు వెళ్లగలనని అచ్యుతరావు అన్నారు. -
బంగ్లాతో పోరు ఖరారు
తౌరంగ (న్యూజిలాండ్): అండర్–19 ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గ్రూప్ ‘సి’లో కెనడాపై ఇంగ్లాండ్ భారీ విజయం సాధించడంతో... ఆ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లా... శనివారం అధికారికంగా క్వార్టర్స్‌కు చేరింది. గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంతో నాకౌట్ దశకు చేరిన భారత్ ఈ నెల 26న బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. లీగ్ దశలో భారత్ ఆడిన మూడు మ్యాచుల్లోను విజయాలు సాధించి అజేయంగా నిలిచింది. -
క్రికెటర్లకు తినడానికీ డబ్బుల్లేవు!
బీసీసీఐని సంస్కరించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాల పుణ్యమాని ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో తలపడుతున్న భారత అండర్-19 జట్టుకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఆటగాళ్లతో పాటు చివరకు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా కనీసం తినడానికి కూడా డబ్బులు అందడం లేదు! కార్యదర్శి పదవి నుంచి అజయ్ షిర్కేను తొలగించడంతో.. చెక్కుల మీద సంతకాలు పెట్టే అధికారి ఎవరి వద్దా లేకుండా పోయింది. దాంతో ఆటగాళ్లకు, ద్రవిడ్‌కు డబ్బులు అందట్లేదు. జూనియర్ క్రికెటర్లకు రోజుకు రూ. 6800 చొప్పున రావాల్సి ఉంది. కానీ ఆ డబ్బులు రావడం లేదు. దాంతో వాళ్లంతా తమ భోజనం ఖర్చులు జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోంది. చాలామంది తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకుంటున్నారు. కొత్తగా చెక్ పవర్ ఎవరికో ఒకరికి ఇవ్వాలంటే బీసీసీఐ సభ్యులు కొత్త తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సిరీస్ ముగిసిపోగానే మొత్తం డీఏ ఎంత అవుతుందో లెక్కచూసి ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఖాతాలకు పంపేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐలో కూడా చాలా సమస్యలున్నాయని, చెక్ పవర్ ఎవరివద్దా లేకపోవడంతో చెల్లింపులు ఏవీ చేయలేకపోతున్నామని అన్నారు. మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆతిథ్య సంఘం ఏర్పాటుచేస్తోందని, బ్రేక్‌ఫాస్ట్ అయితే హోటల్ నుంచి కాంప్లిమెంటరీగా అందుతోందని అండర్-19 క్రికెట్ టీమ్ సభ్యుడొకరు చెప్పారు. ముంబైలో తమను ఓ స్టార్హోటల్లో ఉంచారని, అక్కడ శాండ్విచ్ తినాలన్నా రూ. 1500 పెట్టాల్సి వస్తోందని వాపోయారు. రోజంతా ఆడి అలిసిపోయిన ఆటగాళ్లు భోజనం కోసం మళ్లీ బయటకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు కోసం హైదరాబాద్ వచ్చిన సీనియర్ జట్టుకు మాత్రం ఇలాంటి సమస్యలు ఏమీ లేవు. ఆటగాళ్ల రోజువారీ అలవెన్సుల విషయాన్ని చూసుకోవాలని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) తెలిపింది.