ఆఖరి మ్యాచ్‌లోనూ ఓడిన జింబాబ్వే
బులవాయో: జింబాబ్వేపై వన్డే సిరీస్ గెలిచి సంచలనం సృష్టించిన అఫ్ఘానిస్తాన్ జట్టు ఇప్పుడూ టి20 సిరీస్‌లోనూ జోరు చూపెట్టింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ జింబాబ్వేను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (26 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ముతుబామి (33 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్సర్లు), చిగుంబురా (28 బంతుల్లో 33; 3 ఫోర్లు) చెలరేగి ఆడారు.
దౌలత్, నబీ, హమ్జా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత అఫ్ఘానిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఉస్మాన్ ఘని (45 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), గుల్బాదిన్ నబీ (31 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో హోరెత్తించారు.
అఫ్ఘాన్‌దే టి20 సిరీస్
Published Thu, Oct 29 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM
Advertisement
Advertisement