టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్ బోణీ కొట్టింది. గయనా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్ అదరగొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్టానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.
గుర్భాజ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు.
తొలి వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్ సాధించారు.
ఐదేసిన ఫారూఖీ..
184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా.. అఫ్గానీ బౌలర్ల దాటికి 58 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫారూఖీ దాటికి పసికూన ఉగండా విలవిల్లాడింది.
ఫారూఖీ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్ హాక్, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఉంగండా బ్యాటర్లలో ఒబుయా(14) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment