టీ20 వరల్డ్‌కప్-2024లో పసికూన ఉగండా ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఉగండా ఓటమి పాలైంది.
174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా విండీస్ బౌలర్ల దాటికి విల్లవిల్లాడింది. కేవలం 39 పరుగులకే ఉగండా కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు.
ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
చెత్త రికార్డు..
ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును ఉగండా తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన నెదర్లాండ్స్ చెత్త రికార్డును ఉగండా సమం చేసింది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్ కూడా 39 పరుగులకే ఆలౌటైంది. ఇక జాబితాలో తర్వాతి స్ధానాల్లో నెదర్లాండ్స్(44), వెస్టిండీస్(55), ఉగండా(58) ఉన్నాయి.
వెస్టిండీస్ అరుదైన రికార్డు..
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పరుగుల పరంగా భారీ తేడాతో గెలిచిన రెండో జట్టుగా విండీస్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక ఉంది. జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో కెన్యాపై శ్రీలంక ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
Comments
Please login to add a commentAdd a comment