
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ ప్రయాణం ముగిసింది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో(డక్ వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ పరాజయం పాలైంది.
చివరి వరకు విండీస్ అద్బుతంగా పోరాడనప్పటకి విజయం మాత్రం ప్రోటీస్‌నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులకే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో ప్రోటీస్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులకు కుదించారు. అయితే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక దక్షిణాఫ్రికా వికెట్ల పతనం కొనసాగింది.
చివరికి ఆల్‌రౌండర్ మార్కో జానెసన్ 21 పరుగులతో ఆజేయంగా నిలిచి దక్షిణాఫ్రికాను సెమీస్‌కు చేర్చాడు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రావెమన్ పావెల్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైమని పావెల్ తెలిపాడు.
"ఈ మ్యాచ్‌లో ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆఖరి వరకు పోరాడినందుకు మా బాయ్స్‌కు క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాము.
సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాం. కానీ 135 పరుగులను కాపాడుకోగలమని మా బౌలర్లు విశ్వసించారు. అందుకు తగ్గట్టు చివరివరకు తమ వంతు ప్రయత్నం చేశారు.
మేము సెమీఫైనల్‌కు చేరుకోపోవచ్చు గానీ గత 12 నెలలగా మేము బాగా ఆడుతున్నాం. ఈ టోర్నీలోమాకు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఇది నిజంగా మాకు చాలా సంతోషాన్నిచ్చింది. మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికి ధన్యవాదాలని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పావెల్ పేర్కొన్నాడు.