Uganda Team
-
WI Vs UGA: 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024లో పసికూన ఉగండా ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఉగండా ఓటమి పాలైంది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా విండీస్ బౌలర్ల దాటికి విల్లవిల్లాడింది. కేవలం 39 పరుగులకే ఉగండా కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.చెత్త రికార్డు..ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును ఉగండా తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన నెదర్లాండ్స్ చెత్త రికార్డును ఉగండా సమం చేసింది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్ కూడా 39 పరుగులకే ఆలౌటైంది. ఇక జాబితాలో తర్వాతి స్ధానాల్లో నెదర్లాండ్స్(44), వెస్టిండీస్(55), ఉగండా(58) ఉన్నాయి.వెస్టిండీస్ అరుదైన రికార్డు..టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పరుగుల పరంగా భారీ తేడాతో గెలిచిన రెండో జట్టుగా విండీస్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక ఉంది. జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో కెన్యాపై శ్రీలంక ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది -
WI Vs UGA: 5 వికెట్లతో చెలరేగిన అకిల్.. పసికూనపై విండీస్ ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. ఉగండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్‌జనీ తలా వికెట్ సాధించారు. -
WI Vs UGA: చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. ఓ దశలో విండీస్ ఈజీగా 200 పరుగుల మార్క్ దాటుతుందని అంతా భావించారు. కానీ ఉగండా బౌలర్లు ఆఖరి 6 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 200 పరుగుల మార్క్‌ను కరేబియన్లు దాటలేకపోయారు. ఉగండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్‌జనీ తలా వికెట్ సాధించారు. -
అఫ్గానిస్తాన్ శుభారంభం.. ఉగండా చిత్తు
టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్ బోణీ కొట్టింది. గయనా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్టానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.గుర్భాజ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు.తొలి వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్ సాధించారు.ఐదేసిన ఫారూఖీ..184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా.. అఫ్గానీ బౌలర్ల దాటికి 58 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫారూఖీ దాటికి పసికూన ఉగండా విలవిల్లాడింది. ఫారూఖీ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్ హాక్, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఉంగండా బ్యాటర్లలో ఒబుయా(14) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. -
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్ బదలు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే 16.5 ఓవర్లలో చేధించింది.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75), ఫఖార్ జమాన్(78) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.ఐరీష్ బ్యాటర్లలో లారెన్ టక్కర్(51), టాక్టెర్(32) పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, నసీం షా తలా వికెట్ సాధించారు.బాబర్ ఆజం వరల్డ్ రికార్డు..ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ సారథ్యంలో ఇప్పటివరకు పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్‌గా ఉగాండాకు 44 టీ20లు విజయాలు అందించాడు. తాజా విజయంతో మసాబా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (42), మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ సారథి అస్గర్ ఆఫ్ఘన్ (42), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (41), రోహిత్ శర్మ (41) ఉన్నారు. -
'పులిచింతల'ను సందర్శించిన ఉగాండా బృందం
మేళ్లచెర్వు: నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలో కృష్ణా నదిపై ఏర్పాటైన పులిచింతల బహుళార్థక సాగునీటి ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులను ఉగాండా అధికారుల బృందం శనివారం సందర్శించింది. తమ దేశంలో మౌలిక సదుపాయాల ఏర్పాటులో భాగంగా ఉగాండా ప్రభుత్వం... భారత్‌లో మౌలిక సదుపాయాలపై అధ్యయనం కోసం ఆరుగురు అధికారులను పంపింది. వీరు హైదరాబాద్‌లోని మెట్రోరైలు ప్రాజెక్టును కూడా సందర్శించారు. శనివారం పులిచింతలను సందర్శించి ప్రాజెక్టు విశేషాలను, వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కృష్ణా జిల్లా జేసీ సత్యనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.