ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్ బదలు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే 16.5 ఓవర్లలో చేధించింది.
పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75), ఫఖార్ జమాన్(78) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
ఐరీష్ బ్యాటర్లలో లారెన్ టక్కర్(51), టాక్టెర్(32) పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, నసీం షా తలా వికెట్ సాధించారు.
బాబర్ ఆజం వరల్డ్ రికార్డు..
ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు.
బాబర్ సారథ్యంలో ఇప్పటివరకు పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్‌గా ఉగాండాకు 44 టీ20లు విజయాలు అందించాడు.
తాజా విజయంతో మసాబా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (42), మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ సారథి అస్గర్ ఆఫ్ఘన్ (42), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (41), రోహిత్ శర్మ (41) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment