
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో జట్లు సమంగా పోరాడనప్పటకి.. సూపర్ ఓవర్‌లో మాత్రం విజయం యూఎస్ఎనే వరించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
పాక్ కొంపముంచిన అమీర్..
ఇక పాకిస్తాన్ తరపున సూపర్ ఓవర్ వేసే బాధ్యతను సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్‌కు కెప్టెన్ బాబర్ ఆజం అప్పగించాడు. బాబర్ ఆజం నమ్మకాన్ని అమీర్ వమ్ము చేశాడు. సూపర్ ఓవర్ వేసిన అమీర్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.
ఏడు పరుగులు వైడ్ల రూపంలోనే రావడం గమనార్హం. అనంతరం 19 పరుగుల లక్ష్య చేధనలో పాక్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. ఇక పాక్ ఓటమికి పరోక్షంగా కారణమైన మహ్మద్ అమీర్‌ను ఆ జట్టు అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అమీర్ కంటే అఫ్రిదికి బౌలింగ్ బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.