జింబాబ్వేతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 శ్రీలంక స్పిన్ సెన్సేషన్, ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ (4-0-15-4) మ్యాజిక్ చేశాడు. ఫలితంగా శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. హసరంగ, తీక్షణ (3.1-0-14-2), ఏంజెలో మాథ్యూస్ (2-0-15-2), ధనంజయ డిసిల్వ (1-0-1-1), మధుషంక (2-0-22-1) ధాటికి 14.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కమున్‌హుకామ్వే (12), బ్రియన్ బెన్నెట్ (29), సీన్ విలియమ్స్ (15), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 10.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. పథుమ్ నిస్సంక (39 నాటౌట్), కుశాల్ మెండిస్ (33) రాణించగా.. ధనంజయ డిసిల్వ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కుశాల్ మెండిస్ వికెట్ సీన్ విలియమ్స్‌కు దక్కింది. ఈ సిరీస్‌లో తొలి టీ20లో శ్రీలంక గెలువగా.. రెండో మ్యాచ్ జింబాబ్వే, ఇప్పుడు మూడో మ్యాచ్ మళ్లీ శ్రీలంకనే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment