గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఆ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది.
దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.
తుది జట్లు..
శ్రీలంక: పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వికెట్‌కీపర్), మిలన్ రత్నాయక్, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పెరిస్, అసిత ఫెర్నాండో
న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీ
చదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్‌లకు నో ప్లేస్..!
Comments
Please login to add a commentAdd a comment