
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను దురదృష్టం వెంటాండింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన ఫెర్గూసన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే ఈ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన అయ్యర్ తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో హిట్ వికెట్ రూపంలో అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో అయ్యర్ 13 పరుగులు సాధించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
Shreyas was looking good but not to be! pic.twitter.com/M55baGpgHJ
— That-Cricket-Girl (@imswatib) November 20, 2022
చదవండి: IND vs NZ: సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. పాకిస్తాన్ కెప్టెన్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment