టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో కేవలం 67 బంతుల్లో సెంచరీ చేసిన అయ్యర్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. 2007 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గిల్‌క్రిస్ట్ 72 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో గిల్లీ ఆల్‌టైమ్ రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 105 పరుగులు చేశాడు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో అయ్యర్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ.
చెలరేగిన భారత బ్యాటర్లు..
ఇక వాంఖడే వేదికగా జరుగుతున్న సెమీస్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి(117), అయ్యర్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరితో పాటు ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(80), రోహిత్ శర్మ(47) పరుగులతో అదరగొట్టారు. కాగా కోహ్లికి ఇది 50వ అంతర్జాతీయ వన్డే సెంచరీ. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.
చదవండి: Virat Kohli: కోహ్లి సాధించేశాడు.. సచిన్ సెంచరీల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment