క్రికెట్‌లో హిట్ వికెట్ అవ్వడం కొత్తేమి కాదు. చాలా సార్లు చాలా మంది ఆటగాళ్లు అయ్యారు. పేరు మోసిన దిగ్గజ ఆటగాళ్ల కూడా దీనికి అతితమేమి కాదు. కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అయిన హిట్ వికెట్‌ను మాత్రం ఇంతవరకు ఎక్కడా చూసుండరు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ఎన్‌పీఎస్, విక్టోరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ జేక్ వెదర్లాడ్ వినూత్నంగా ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన అధికారిక వెబ్‌సైట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఈ ఆసీస్ ఆటగాడు వార్తల్లో నిలిచాడు. ఏ బ్యాట్స్‌మన్ అయినా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనక్కి జరిగి బ్యాట్‌ను స్టంప్స్ తగిలించడం లేక షూస్ తగిలి హిట్ వికెట్ అవ్వడం చూసుంటాం.