Ind Vs Nz: Harshal Patel Becomes Second Indian To Be Dismissed Hit Wicket In T20Is - Sakshi
Sakshi News home page

IND Vs NZ: పాపం హర్షల్ పటేల్.. రాహుల్‌ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు..

Published Sun, Nov 21 2021 10:03 PM | Last Updated on Mon, Nov 22 2021 12:53 PM

Harshal Patel becomes second Indian to be dismissed hit wicket in T20Is - Sakshi

Harshal Patel becomes second Indian to be dismissed hit wicket in T20Is: టీ20ల్లో హర్షల్‌ పటేల్‌ ఓ చెత్త  రికార్డును మూటకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో అనుహ్యరీతిలో  హిట్‌ వికెట్‌గా హర్షల్‌ పటేల్ వెనుదిరిగాడు. దీంతో టీ20ల్లో టీమిండియా తరుపున హిట్‌ వికెట్‌గా ఔటైన రెండో ఆటగాడిగా హర్షల్‌  నిలిచాడు.

ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో కట్‌ షాట్‌కు ప్రయత్నించిన హర్షల్‌ పటేల్‌.. తన బ్యాట్‌తో వికెట్లను టచ్‌ చేయడంతో ఈ ఆప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకముందు 2018లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ హిట్‌ వికెట్‌గా ఔటయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్ 11 బంతుల్లో 18 పరుగులు సాధించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మెదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా, కీవిస్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి  184 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(56) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, కిషన్‌(29), శ్రేయాప్‌ అయ్యర్‌(25),దీపక్‌ చాహర్‌(21) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ రెండు వికెట్లు, సోధి, మిల్నే చెరో వికెట్‌ సాధించారు. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ తడబడుతుంది. 10 ఓవర్లలలో మూడు వికెట్ల నష్టానికి కివీస్‌ 68 పరగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement