జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన విలియమ్స్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 5వ బంతిని బౌండరీగా మలిచిన జితేష్.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
స్టంప్స్‌కు దగ్గరగా ఆడుతున్న జితేష్.. ఫోర్ కొట్టే క్రమంలో బ్యాలన్స్ కోల్పోయి తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో 4 పరుగులు చేసిన జితేష్ హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. జితేష్ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐదో భారత ఆటగాడిగా..
కాగా అంతర్జాతీయ టీ20ల్లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన ఐదో భారత ఆటగాడిగా జితేష్ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్, హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో జితేష్ శర్మ కూడా చేరాడు. ఇక ఆఖరి టీ20లో దక్షిణాఫ్రికాపై 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు.
— Sitaraman (@Sitaraman112971) December 14, 2023
చదవండి: IND vs SA: ఇదేమి అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment