
షార్జా: ఒక బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టిన బంతికే పెవిలియన్‌కు చేరడం చాలా అరుదనే చెప‍్పాలి. రెండు రోజుల కిందట పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టి పెవిలియన్‌కు చేరాడు. గురువారం క్వెట్టా గ్లాడియేటర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ అన్వర్ అలీ క్రీజులో ఉన్నాడు. ఇక్కడ బౌలర్ వహాబ్ రియాజ్ బాల్ వేయగా.. అన్వర్ అలీ లాంగ్ ఆన్ మీదుగా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి కాస్తా బౌండరీ లైన్ కూడా దాటి జనాల్లో పడింది. ఒకవైపు అలీతో పాటు స్టేడియంలో ప్రేక్షకులు సిక్సర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ఆ జోష్ ఎంతసేపో నిలవలేదు. అలీ అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. ఇదేంటి అని అందరూ షాకయ్యారు. రెండు మూడు నిమిషాల తర్వాత కాని క్లారిటీ రాలేదు. సిక్స్ కొట్టే సమయంలో అలీ కాలు వికెట్లను తాకి బెయిల్స్‌ను పడగొట్టింది. దాంతో బ్యాట్స్‌మన్ అలీకి నిరాశ తప్పలేదు. సిక్స్ కొట్టినా చిత్రంగా పెవిలియన్‌కు చేరడం కూడా అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment