ఇలా కూడా హిట్‌ వికెట్‌ అవుతారా? | Have You Seen This Comical Hit Wicket Dismissal  | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 5 2018 9:27 AM | Last Updated on Wed, Sep 5 2018 9:42 AM

Have You Seen This Comical Hit Wicket Dismissal  - Sakshi

బ్యాట్స్‌మన్‌ ఆశ్చర్యం

సిడ్నీ : క్రికెట్‌లో హిట్‌ వికెట్‌ అవ్వడం కొత్తేమి కాదు. చాలా సార్లు చాలా మంది ఆటగాళ్లు అయ్యారు. పేరు మోసిన దిగ్గజ ఆటగాళ్ల కూడా దీనికి అతితమేమి కాదు. కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ అయిన హిట్‌ వికెట్‌ను మాత్రం ఇంతవరకు ఎక్కడా చూసుండరు.  ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా ఎన్‌పీఎస్‌, విక్టోరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ జేక్‌ వెదర్లాడ్‌ వినూత్నంగా ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తన అధికారిక వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ఈ ఆసీస్‌ ఆటగాడు వార్తల్లో నిలిచాడు. ఏ బ్యాట్స్‌మన్‌ అయినా భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో వెనక్కి జరిగి బ్యాట్‌ను స్టంప్స్‌ తగిలించడం లేక షూస్‌ తగిలి హిట్‌ వికెట్‌ అవ్వడం చూసుంటాం.

కానీ ఇక్కడ వెదర్లాడ్‌ అయిన హిట్‌ వికెట్‌ చాలా ఢిఫరెంట్‌. వెదర్లాడ్‌ చేతుల్లో నుంచి జారిన బ్యాట్‌ గాల్లోకి లేచి అమాంతం వికెట్లపై పడింది. ఒక్కసారిగా వెదర్లాడ్‌ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. ఇలా కూడా హిట్‌ వికెట్‌ అవుతారా అని మైదానంలోని ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇటీవల ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో వినూత్నంగా ఒకే బంతికి రెండు విధాల ఔటైన విషయం తెలిసిందే. అంపైర్‌నే తికమక పెట్టిన ఈ వికెట్‌ అప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇక జేక్‌ వెదర్లాడ్‌ ఇలా వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. బిగ్‌బాష్‌ లీగ్‌ సందర్భంగా ఓ మ్యాచ్‌లో అందుకున్న అద్బుత క్యాచ్‌ అతన్ని ఆ సమయంలో హీరోను చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement