మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. షార్జా వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.
94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా అమ్మాయిలు చేధించారు. స్టార్ ఓపెనర్ బెత్ మూనీ 43 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. లంక బౌలర్లలో ప్రబోధని, రణవీర, కుమారి తలా వికెట్ సాధించారు.
తేలిపోయిన లంక బ్యాటర్లు..
అంతకముందు ఆసీస్ బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులకే పరిమితమైంది.
ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ స్కాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోలనిక్స్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఈ ఓటమితో శ్రీలంక దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా?
Comments
Please login to add a commentAdd a comment