లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ రైజింగ్ స్టార్, యువ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించిన అట్కిన్సన్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.
ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అట్కిన్సన్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 103 బంతుల్లోనే అట్కిన్సన్ తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న అట్కిన్సన్.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇక ఈ సెంచరీతో అతడు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు సంపాదించుకున్నాడు. అదే విధంగా పలు అరుదైన రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. లార్డ్స్‌లో 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా అట్కిన్సన్ నిలిచాడు.
లార్డ్స్‌లో 8వ స్ధానంలో వచ్చి సెంచరీలు చేసిన వారు వీరే
స్టువర్ట్ బ్రాడ్(169, ఇంగ్లండ్)
గుబ్బి అలెన్(122, ఇంగ్లండ్ )
బెర్నార్డ్ జూలియన్( 121, వెస్టిండీస్)
గస్ అట్కిన్సన్( 118, ఇంగ్లండ్)
రే ఇల్లింగ్ వర్త్(113, ఇంగ్లండ్)
అజిత్ అగార్కర్(109, భారత్)
అదే విధంగా లార్డ్స్‌లో టెస్ట్ సెంచరీ, 10 వికెట్ల ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా కూడా అట్కిన్సన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అట్కిన్సన్‌తో పాటు గుబ్బి అలెన్, కీత్ మిల్లర్ , ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ ఉన్నారు.
He's done it! 💪
Enjoy the moment Gus Atkinson reaches his first Test match century 👏 pic.twitter.com/lUZ8ECp7G2— Sky Sports Cricket (@SkyCricket) August 30, 2024
Comments
Please login to add a commentAdd a comment