Gus Atkinson
-
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం
శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో మరో సవాల్‌కు సిద్దమైంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, 5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడనుంది. అయితే ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తమ జట్టు స్టార్ పేసర్ గుస్ అట్కిన్సన్కు ఈసీబీ విశ్రాంతినిచ్చింది. ఈ విషయాన్నిఈసీబీ ధ్రువీకరించింది. అతడి స్ధానాన్ని మరో యువ పేసర్ ఓలీ స్టోన్‌తో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది.ఈ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. కాగా లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోకి వచ్చిన అట్కిన్సన్ తన ప్రదర్శనతో అందరినికి ఆకట్టుకున్నాడు.వెస్టిండీస్‌పై డెబ్యూ మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఓవరాల్‌గా తన అరంగేట్ర సిరీస్‌లో 22 వికెట్లు సాధించి తన పేరు మోరుమ్రోగేలా చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో సిరీస్‌లో కూడా 12 వికెట్లు పడగొట్టాడు. కేవలం రెండు సిరీస్‌లలోనే 34 వికెట్లు పడగొట్టి తన అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.అంతేకాకుండా బ్యాట్‌తో కూడా అదరగొట్టాడు. లార్డ్స్ వేదికగా లంకతో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. అండర్సర్ వారుసుడిగా వచ్చిన అట్కిన్సన్పై వర్క్‌లోడ్ తగ్గించాలని ఈసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు రెస్టు ఇచ్చింది.చదవండి: 144 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి: నిసాంక ప్రపంచ రికార్డు -
శతక్కొట్టిన ఇంగ్లండ్ పేసర్.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్
England vs Sri Lanka, 2nd Test Day 2 Report: ఇంగ్లండ్ యువ పేస్ బౌలర్ అట్కిన్సన్ (115 బంతుల్లో 118;14 ఫోర్లు, 4 సిక్సర్లు) లార్డ్స్ ఆనర్ బోర్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అట్కిన్సన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఏళ్ల అట్కిన్సన్కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.లార్డ్స్ ఆనర్ బోర్డులో అట్కిన్సన్ పేరుగత నెలలో వెస్టిండీస్ సిరీస్ ద్వారా లార్డ్స్‌లోనే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన అట్కిన్సన్ ఆడిన మొదటి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మొత్తం 12 వికెట్లు తీసి ఇప్పటికే లార్డ్స్ ఆనర్ బోర్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ ప్రతిభతో మరోసారి అందులో చోటు దక్కించుకున్నాడు.శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్‌కాగా అట్కిన్సన్ దూకుడుతో ఓవర్‌నైట్ స్కోరు 358/7తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 427 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 5, మిలాన్ రత్నాయకే, లహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 55.3 ఓవర్లలో 196 పరుగులు చేసి ఆలౌటైంది.256 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్కమిందు మెండిస్ (120 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒలీ స్టోన్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ (7) ఔట్ కాగా.. కెప్టెన్ ఓలీ పోప్ (2 బ్యాటింగ్), బెన్ డకెట్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఓవరాల్‌గా 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి -
లార్డ్స్‌లో ఊచకోత.. 8వ స్ధానంలో వచ్చి విధ్వంసకర సెంచరీ
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ రైజింగ్ స్టార్, యువ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించిన అట్కిన్సన్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అట్కిన్సన్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 103 బంతుల్లోనే అట్కిన్సన్ తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న అట్కిన్సన్.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ సెంచరీతో అతడు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు సంపాదించుకున్నాడు. అదే విధంగా పలు అరుదైన రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. లార్డ్స్‌లో 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా అట్కిన్సన్ నిలిచాడు. లార్డ్స్‌లో 8వ స్ధానంలో వచ్చి సెంచరీలు చేసిన వారు వీరేస్టువర్ట్ బ్రాడ్(169, ఇంగ్లండ్)గుబ్బి అలెన్(122, ఇంగ్లండ్ )బెర్నార్డ్ జూలియన్( 121, వెస్టిండీస్)గస్ అట్కిన్సన్( 118, ఇంగ్లండ్)రే ఇల్లింగ్ వర్త్(113, ఇంగ్లండ్)అజిత్ అగార్కర్(109, భారత్)అదే విధంగా లార్డ్స్‌లో టెస్ట్ సెంచరీ, 10 వికెట్ల ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా కూడా అట్కిన్సన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అట్కిన్సన్‌తో పాటు గుబ్బి అలెన్, కీత్ మిల్లర్ , ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ ఉన్నారు. He's done it! 💪Enjoy the moment Gus Atkinson reaches his first Test match century 👏 pic.twitter.com/lUZ8ECp7G2— Sky Sports Cricket (@SkyCricket) August 30, 2024 -
Eng vs SL: మూడేళ్ల తర్వాత.. తుదిజట్టులో తొలిసారి
శ్రీలంకతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఒక మార్పుతో లార్డ్స్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. పేసర్ మార్క్‌వుడ్ స్థానాన్ని ఓలీ స్టోన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా 2021లో చివరగా ఇంగ్లండ్ తరఫున టెస్టు ఆడిన ఓలీ స్టోన్.. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండటం విశేషం.లంకతో తొలి టెస్టులో మార్క్‌వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ ఫాస్ట్‌బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల పేసర్ జోష్ హల్‌ను అతడి స్థానంలో జట్టుకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ బోర్డు.. హల్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఓలీ స్టోన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన 30 ఏళ్ల ఓలీ స్టోన్.. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 3 టెస్టుల్లో 10, ఎనిమిది వన్డేల్లో 8 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క టీ20 ఆడినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పర్యాటక లంక నుంచి గట్టి పోటీ ఎదురుకాగా.. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(128 బంతుల్లో 62) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇరు జట్ల మధ్య లండన్‌లో లార్డ్స్ మైదానంలో ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అతడికి డిప్యూటీగా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంపిక చేసింది ఇంగ్లండ్ బోర్డు.శ్రీలంకతో లండన్ వేదికగా రెండో టెస్టు ఇంగ్లండ్ తుదిజట్టులారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్. -
సుందర్‌కు నిరాశ.. ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా అట్కిన్సన్
జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 12) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, మహిళల విభాగంలో శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పరుషుల విభాగంలో అవార్డు కోసం అట్కిన్సన్కు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అంతిమంగా అవార్డు అట్కిన్సన్నే వరించింది. ఈ అవార్డు కోసం అట్కిన్సన్, సుందర్‌తో పాటు స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ పోటీపడ్డాడు. మహిళల విభాగంలో చమారీతో పాటు టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ అవార్డు రేసులో నిలిచారు. జులై నెలలో వివిధ ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా విజేతలను ఓటింగ్ ద్వారా నిర్ణయించారు.గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా ప్లేయర్
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. జులై నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో ఇద్దరితో కలిసి సుందర్ ఈ అవార్డు రేసులో నిలిచాడు. సుందర్‌తో పాటు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు, టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. వీరందరు జులై నెలలో వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు.Presenting the nominees for the Men's and Women's ICC Player of the Month for July 2024.Whom would you cast your vote for? pic.twitter.com/nAqqtwOBok— CricTracker (@Cricketracker) August 5, 2024గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
Eng Vs WI: మరోసారి మెరిసిన అట్కిన్సన్
England vs West Indies, 3rd Test Day 1: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాత్‌వైట్ (61; 8 ఫోర్లు), హోల్డర్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 75.1 ఓవర్లలో 282 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్లో జొషువా సిల్వా (49; 3 ఫోర్లు) కూడా రాణించాడు.ఒక దశలో 76/1గా ఉన్న విండీస్ 115/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. అనంతరం జొషువా, హోల్డర్లు ఆరో వికెట్‌కు 109 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. వోక్స్ (3/69) ఈ జోడీని విడగొట్టి విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అట్కిన్సన్ (4/67) కీలకమైన వికెట్లు తీసి విండీస్ ఆట కట్టించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లకు 38 పరుగులు చేసింది. 2-0తో సిరీస్ కైవసంకాగా మూడు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయభేరి మోగించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. అందుకు అనుగుణంగానే బర్మింగ్‌హాంలో అడుగులు వేస్తోంది.తుదిజట్లుఇంగ్లండ్జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.వెస్టిండీస్క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాసన్ హోల్డర్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్. -
విండీస్ ప్లేయర్ భారీ సిక్సర్.. ప్రేక్షకులకు తప్పిన పెను ప్రమాదం
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో విండీస్ ఆటగాడు షమార్ జోసఫ్ బాదిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు స్టేడియం పైకప్పుపై టైల్స్ బద్దలయ్యాయి.Omg that six by Shamar Joseph broke the roof and part of that roof fell on the spectators unbelievable#WTC25 | 📝 #ENGvWI pic.twitter.com/xU8IMTgF5T— Cinephile (@jithinjustin007) July 20, 2024బద్దలైన టైల్స్ కింద కూర్చున్న ప్రేక్షకులపై పడబోగా వారు తప్పించుకున్నారు. ఒకవేళ ప్రేక్షకులు అప్రమత్తం కాకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. రూఫ్ కింద కూర్చున్న వారు తీవ్ర గాయాల పాలయ్యేవారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.కాగా, 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమార్ జోసఫ్ మూడో రోజు ఆటలో చెలరేగిపోయాడు. షమార్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. షమార్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా విండీస్‌కు 41 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ లభించింది.అంతకుముందు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో.. అలిక్ అథనాజ్ (82), జాషువ డసిల్వ (82 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. దీనికి ముందు ఓలీ పోప్ (121) సెంచరీతో.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి 207 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యారీ బ్రూక్ (71), జో రూట్ (37) క్రీజ్‌లో ఉన్నారు.