ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో విండీస్ ఆటగాడు షమార్ జోసఫ్ బాదిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు స్టేడియం పైకప్పుపై టైల్స్ బద్దలయ్యాయి.
Omg that six by Shamar Joseph broke the roof and part of that roof fell on the spectators unbelievable#WTC25 | 📝 #ENGvWI pic.twitter.com/xU8IMTgF5T
— Cinephile (@jithinjustin007) July 20, 2024
బద్దలైన టైల్స్ కింద కూర్చున్న ప్రేక్షకులపై పడబోగా వారు తప్పించుకున్నారు. ఒకవేళ ప్రేక్షకులు అప్రమత్తం కాకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. రూఫ్ కింద కూర్చున్న వారు తీవ్ర గాయాల పాలయ్యేవారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
కాగా, 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమార్ జోసఫ్ మూడో రోజు ఆటలో చెలరేగిపోయాడు. షమార్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. షమార్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా విండీస్‌కు 41 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ లభించింది.
అంతకుముందు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో.. అలిక్ అథనాజ్ (82), జాషువ డసిల్వ (82 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది.
దీనికి ముందు ఓలీ పోప్ (121) సెంచరీతో.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి 207 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యారీ బ్రూక్ (71), జో రూట్ (37) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment