వెస్టిండీస్ యువ పేస్ సంచలనం షామర్ జోసెఫ్ టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో జోసెఫ్ సంచలన బంతితో మెరిశాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను జోషఫ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. జోషఫ్ వేసిన డెలివరీకి వార్నర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.
ఆసీస్ ఇన్నింగ్స్ 2వ వేసిన జోషఫ్ తొలి మూడు బంతుల్లో ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. వార్నర్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. ఈ సమయంలో జోసెఫ్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నాలుగో బంతిని జోసెఫ్.. వార్నర్‌కు బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే వార్నర్ ఈ డెలివరీని లెగ్ సైట్ ఆడటానికి ప్రయత్నించాడు.
కానీ బంతి బ్యాట్‌కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది ఆసీస్‌తో గబ్బా వేదికగా జరిగిన టెస్టులో సంచలన ప్రదర్శన కనబరిచిన జోసెఫ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక వార్మాప్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌పై 35 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో పూరన్ 75 పరుగులు చేశాడు. జాన్సన్ ఛార్లెస్(40), రూథర్‌ఫోర్డ్(47) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment