కుప్పకూలిన దక్షిణాఫ్రికా | South Africas batsmen faltered in the second Test | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన దక్షిణాఫ్రికా

Published Fri, Aug 16 2024 4:10 AM | Last Updated on Fri, Aug 16 2024 4:10 AM

South Africas batsmen faltered in the second Test

ప్రొవిడెన్స్‌: వెస్టిండీస్‌ పేసర్ల ధాటికి రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు... విండీస్‌ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.

షామర్‌ జోసెఫ్‌ (5/33), జైడెన్‌ సీల్స్‌ (3/41) ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 134 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. డేవిడ్‌ బెడింగ్‌హమ్‌ (28), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (26), కైల్‌ వెరినె (21) ఓ మాదిరిగా ఆడగా.. కెపె్టన్‌ తెంబా బవుమా (0), మార్క్‌రమ్‌ (14), టోనీ డి జోర్జి (1), ముల్డర్‌ (0), కేశవ్‌ మహరాజ్‌ (0) విఫలమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement