శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో మరో సవాల్‌కు సిద్దమైంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, 5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడనుంది. అయితే ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తమ జట్టు స్టార్ పేసర్ గుస్ అట్కిన్‌సన్‌కు ఈసీబీ విశ్రాంతినిచ్చింది. ఈ విషయాన్నిఈసీబీ ధ్రువీకరించింది. అతడి స్ధానాన్ని మరో యువ పేసర్ ఓలీ స్టోన్‌తో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది.
ఈ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. కాగా లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోకి వచ్చిన అట్కిన్‌సన్ తన ప్రదర్శనతో అందరినికి ఆకట్టుకున్నాడు.
వెస్టిండీస్‌పై డెబ్యూ మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఓవరాల్‌గా తన అరంగేట్ర సిరీస్‌లో 22 వికెట్లు సాధించి తన పేరు మోరుమ్రోగేలా చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో సిరీస్‌లో కూడా 12 వికెట్లు పడగొట్టాడు. కేవలం రెండు సిరీస్‌లలోనే 34 వికెట్లు పడగొట్టి తన అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
అంతేకాకుండా బ్యాట్‌తో కూడా అదరగొట్టాడు. లార్డ్స్ వేదికగా లంకతో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. అండర్సర్ వారుసుడిగా వచ్చిన అట్కిన్‌సన్‌పై వర్క్‌లోడ్ తగ్గించాలని ఈసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు రెస్టు ఇచ్చింది.
చదవండి: 144 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి: నిసాంక ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment