వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ వికెట్లతో అట్కిన్సన్ మెరిశాడు. కివీస్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన అట్కిన్సన్.. మూడో బంతిని నాథన్ స్మిత్ ఔట్ చేయగా, నాలుగో బంతికి మాట్ హెన్రీ, ఐదో బంతికి టిమ్ సౌథీని పెవిలియన్‌కు పంపాడు.
దీంతో తొలి టెస్టు హ్యాట్రిక్‌ను ఈ ఇంగ్లండ్ పేసర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా మొదటి ఇన్నింగ్స్‌లో 8.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అట్కిన్సన్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్ 4 వికెట్లు, స్టోక్స్, క్రిస్ వోక్స్ తలా వికెట్ సాధించారు. దీంతో కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఇంగ్లండ్ 280 పరుగులకు ఆలౌటైంది.
అట్కిన్సన్ అరుదైన ఘనత..
ఇక ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన అట్కిన్సన్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గత మూడేళ్లలో టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా అట్కిన్సన్ నిలిచాడు. చివరగా 2021లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ టెస్ట్ హ్యాట్రిక్ సాధించాడు.
టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన 15వ ఇంగ్లండ్ బౌలర్‌గా అట్కిన్సన్ రికార్డులకెక్కాడు.ఓవరాల్‌గా పురుషుల టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన 47వ బౌలర్‌గా అట్కిన్సన్ నిలిచాడు.
ఈ జాబితాలో స్టువర్ట్ బ్రాడ్, జస్ప్రీత్ బుమ్రా, షేన్ వార్న్, ఇర్ఫాన్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గా అట్కిన్సన్ చరిత్ర సృష్టించాడు.
చదవండి: IND vs AUS: సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. అతడు ఏమి చేశాడని? ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment