జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 12) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, మహిళల విభాగంలో శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పరుషుల విభాగంలో అవార్డు కోసం అట్కిన్సన్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అంతిమంగా అవార్డు అట్కిన్సన్‌నే వరించింది.
ఈ అవార్డు కోసం అట్కిన్సన్, సుందర్‌తో పాటు స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ పోటీపడ్డాడు. మహిళల విభాగంలో చమారీతో పాటు టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ అవార్డు రేసులో నిలిచారు. జులై నెలలో వివిధ ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా విజేతలను ఓటింగ్ ద్వారా నిర్ణయించారు.
గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.
చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.
వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్‌లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.
స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.
షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment