శ్రీలంక రైజింగ్ స్టార్ కమిందు మెండిస్ చరిత్రపుటల్లోకెక్కాడు. సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్న కమిందు.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కమిందు ఈ ఏడాది మార్చిలో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్నాడు.
మహిళల విభాగానికి వస్తే సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్‌కు చెందిన ట్యామీ బేమౌంట్ దక్కించుకుంది. బేమౌంట్‌కు కూడా ఇది రెండో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు. 2021 ఫిబ్రవరి ఆమె తొలిసారి ఈ అవార్డు దక్కించుకుంది. సెప్టెంబర్ నెలలో కమిందు టెస్ట్‌ల్లో సత్తా చాటగా.. బేమౌంట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇరగదీసింది.
కమిందు ఈ అవార్డు కోసం సహచరుడు ప్రభాత్ జయసూర్య, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ నుంచి పోటీ ఎదుర్కొనగా.. బేమౌంట్.. ఐర్లాండ్‌కు చెందిన ఏమీ మగూర్, యూఏఈకి చెందిన ఎషా ఓజా నుంచి పోటీ ఎదుర్కొంది. కమిందు సెప్టెంబర్ నెలలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై నాలుగు టెస్ట్‌లు ఆడి 90.20 సగటున 451 పరుగులు చేయగా.. బేమౌంట్ ఐర్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో 279 పరుగులు చేసింది. ఇందులో ఓ భారీ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి.
చదవండి: పాక్‌తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment