శ్రీలంక నయా బ్యాటింగ్ స్టార్ కమిందు మెండిస్‌ను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. కమిందు 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. కమిందు గతేడాది ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. కమిందు గతేడాది 50కి పైగా సగటుతో 1451 పరుగులు సాధించాడు.
ఎరాస్మస్‌కు అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపికయ్యాడు. ఎరాస్మస్ గతేడాది వన్డే, టీ20 ఫార్మాట్లలో అదరగొట్టాడు. అందుకు అతన్ని ఈ అవార్డు వరించింది. ఎరాస్మస్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఎరాస్మస్ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
ఈశా ఓఝాకు మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
యూఏఈ కెప్టెన్ ఈశా ఓఝాకు మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు-2024 లభించింది. గతేడాది ఈషా ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టింది.
ఐసీసీ టెస్ట్ జట్టులో కమిందు
శ్రీలంక అప్‌కమింగ్ స్టార్ కమిందు మెండిస్ 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టులో కమిందుతో పాటు యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్, హ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment