ICC Player Of The Month Award
-
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (నవంబర్ 5) వెల్లడించింది. పురుషుల విభాగంలో పాక్ బౌలర్ నౌమన్ అలీ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఈ అవార్డుకు నామినేట్ కాగా.. మహిళల విభాగంలో టీ20 వరల్డ్‌కప్ టాప్ పెర్ఫార్మర్లు అమేలియా కెర్ (న్యూజిలాండ్), డియాండ్రా డొట్టిన్ (వెస్టిండీస్), లారా వోల్వార్డ్ట్ (సౌతాఫ్రికా) నామినేట్ అయ్యారు.నౌమన్ అలీ: ఈ పాక్ వెటరన్ స్పిన్నర్ అక్టోబర్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నౌమన్ ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 13.85 సగటున 20 వికెట్లు పడగొట్టాడు.కగిసో రబాడ: ఈ సౌతాఫ్రికన్ సీమర్ గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో వీర లెవెల్లో విజృంభించాడు. ఈ సిరీస్‌లో రబాడ టెస్ట్‌ల్లో 300 వికెట్ల మార్కును తాకాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రబాడ 14 వికెట్లు పడగొట్టి, ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. మిచెల్ సాంట్నర్: ఈ న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్టోబర్ నెలలో భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో శివాలెత్తిపోయాడు. పూణే టెస్ట్‌లో సాంట్నర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.డియాండ్రా డొట్టిన్: ఈ విండీస్ ఆల్‌రౌండర్ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ మెగా టోర్నీలో డొట్టిన్ స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌పై విజయాల్లో కీలకపాత్ర పోషించింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో డొట్టిన్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాటు కీలకమైన ఇన్నింగ్స్ (33 పరుగులు) ఆడినప్పటికీ.. విండీస్ ఓటమిపాలైంది.అమేలియా కెర్: ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కెర్ ముఖ్యపాత్ర పోషించింది. ఈ టోర్నీలో కెర్ 135 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.లారా వోల్వార్డ్ట్: గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చడంలో లారా కీలకపాత్ర పోషించింది. ఈ మెగా టోర్నీలో లారా లీడింగ్ రన్ స్కోరర్‌గా (44.60 సగటున 223 పరుగులు) నిలిచింది. వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో లారా కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. -
చరిత్రపుటల్లోకెక్కిన కమిందు మెండిస్
శ్రీలంక రైజింగ్ స్టార్ కమిందు మెండిస్ చరిత్రపుటల్లోకెక్కాడు. సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్న కమిందు.. ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కమిందు ఈ ఏడాది మార్చిలో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్నాడు.మహిళల విభాగానికి వస్తే సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్‌కు చెందిన ట్యామీ బేమౌంట్ దక్కించుకుంది. బేమౌంట్‌కు కూడా ఇది రెండో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు. 2021 ఫిబ్రవరి ఆమె తొలిసారి ఈ అవార్డు దక్కించుకుంది. సెప్టెంబర్ నెలలో కమిందు టెస్ట్‌ల్లో సత్తా చాటగా.. బేమౌంట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇరగదీసింది.కమిందు ఈ అవార్డు కోసం సహచరుడు ప్రభాత్ జయసూర్య, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ నుంచి పోటీ ఎదుర్కొనగా.. బేమౌంట్.. ఐర్లాండ్‌కు చెందిన ఏమీ మగూర్, యూఏఈకి చెందిన ఎషా ఓజా నుంచి పోటీ ఎదుర్కొంది. కమిందు సెప్టెంబర్ నెలలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై నాలుగు టెస్ట్‌లు ఆడి 90.20 సగటున 451 పరుగులు చేయగా.. బేమౌంట్ ఐర్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో 279 పరుగులు చేసింది. ఇందులో ఓ భారీ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. చదవండి: పాక్‌తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ -
సుందర్‌కు నిరాశ.. ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా అట్కిన్సన్
జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 12) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, మహిళల విభాగంలో శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పరుషుల విభాగంలో అవార్డు కోసం అట్కిన్సన్కు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అంతిమంగా అవార్డు అట్కిన్సన్నే వరించింది. ఈ అవార్డు కోసం అట్కిన్సన్, సుందర్‌తో పాటు స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ పోటీపడ్డాడు. మహిళల విభాగంలో చమారీతో పాటు టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ అవార్డు రేసులో నిలిచారు. జులై నెలలో వివిధ ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా విజేతలను ఓటింగ్ ద్వారా నిర్ణయించారు.గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా ప్లేయర్
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. జులై నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో ఇద్దరితో కలిసి సుందర్ ఈ అవార్డు రేసులో నిలిచాడు. సుందర్‌తో పాటు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు, టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. వీరందరు జులై నెలలో వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు.Presenting the nominees for the Men's and Women's ICC Player of the Month for July 2024.Whom would you cast your vote for? pic.twitter.com/nAqqtwOBok— CricTracker (@Cricketracker) August 5, 2024గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 4) ప్రకటించింది. పురుషుల క్రికెట్లో ఈ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ పోటీపడనున్నారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ ఈ అవార్డు రేసులో ఉన్నారు. మార్క్ అదైర్: మార్చి నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్‌లలో అదైర్ అద్భుతంగా రాణించాడు. తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో 8 వికెట్లతో అదరగొట్టిన అదైర్.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో 3 వికెట్లు, టీ20 సిరీస్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. కమిందు మెండిస్: ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాట్ హెన్రీ: మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో హెన్రీ ఆద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-2 తేడాతో కోల్పోయినప్పటికీ హెన్రీ 17 వికెట్లతో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించిన హెన్రీ 25.25 సగటున 101 పరుగులు చేశాడు. ఆష్లే గార్డ్నర్: మార్చి నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గార్డ్నర్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించింది. ఈ సిరీస్‌లో ఆమె 52 పరుగులు సహా ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గార్డ్నర్ రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకుంది. మైయా బౌచియర్: బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. అమేలియా కెర్: మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెర్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో కెర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టింది. -
యశస్వీ జైశ్వాల్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను జైశ్వాల్‌కు ఈ అవార్డు దక్కింది. స్వదేశలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత నెలలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడిన యశస్వీ 112 సగటుతో ఏకంగా 560 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 209 పరుగులు చేసిన జైశ్వాల్.. రాజ్‌కోట్ టెస్టులో 214 పరుగులతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ సిరీస్‌లో జైశ్వాల్ ఏకంగా 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ అవార్డు కోసం జైశ్వాల్‌తో పాటు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక పోటీపడ్డారు. కానీ ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన జైశ్వాల్‌నే ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఎంపికైంది. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సదర్లాండ్ అద్భుతంగా రాణించింది. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కఠిన నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ Presenting the ICC Player of the Month for February 🙌 Congratulations, Yashasvi Jaiswal 👏👏 🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ — BCCI (@BCCI) March 12, 2024 -
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..
2024 ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 4) వెల్లడించింది. టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక గత నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని ఐసీసీ వీరి పేర్లను ప్రకటించింది. యశస్వి గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో 112 సగటున 560 పరుగులు చేశాడు. ఇందులో వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి. కేన్ మామ ఫిబ్రవరిలో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో (సౌతాఫ్రికాతో) వరుస సెంచరీల సాయంతో 403 పరుగులు చేశాడు. నిస్సంక విషయానికొస్తే.. ఈ లంక ఓపెనర్ గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన 3 వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ సాయంతో 350కిపైగా పరుగులు చేశాడు. మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు గత నెలలో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించారు. స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్ పద్దతిన విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లను వచ్చే వారం ప్రకటిస్తారు. icc-cricket.com/awardsలో పేర్లు నమోదు చేసుకున్న అభిమానులు శనివారం వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. -
ఐసీసీ అవార్డు గెలుచుకున్న ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
బౌలింగ్ సంచలనం, విండీస్ ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (2024 జనవరి) దక్కించుకున్నాడు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను షమార్ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ పోటీపడినప్పటికీ.. విండీస్ సంచలన బౌలర్‌నే అవార్డు వరించింది. వివిధ పద్దతుల్లో జరిగిన ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లు షమార్‌కే దక్కాయి. మహిళల విషయానికొస్తే.. ఈ విభాగంలో జనవరి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అమీ హంటర్(ఐర్లాండ్) దక్కించుకుంది. గత నెలలో అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అమీ హంటర్ ఈ అవార్డుకు ఎంపికైంది. అమీతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. కాగా, షమార్ జోసఫ్ గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ విండీస్ యువ పేసర్ తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. -
వరల్డ్‌కప్ హీరోకే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు
2023 నవంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డును వరల్డ్‌కప్ హీరో, ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ దక్కించుకోగా.. మహిళల విభాగంలో బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ నహీద అక్తర్ ఈ అవార్డును గెలుచుకుంది. పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ట్రవిస్ హెడ్, మొహమ్మద్ షమీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్య తీవ్రపోటీ జరిగినప్పటికీ.. అంతింమంగా హెడ్నే అవార్డు వరించింది. వరల్డ్‌కప్ సెమీస్‌లో (2 వికెట్లు, 62 పరుగులు), ఫైనల్లో (రోహిత్ శర్మ క్యాచ్‌తో పాటు 137 పరుగులు) అద్భుత ప్రదర్శనల కారణంగా మెజార్టీ శాతం ఓట్లు హెడ్కే దక్కాయి. 29 ఏళ్ల హెడ్‌కు ఇది తొలి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కాగా.. ఆసీస్ తరఫున వార్నర్ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న ఆటగాడు హెడే కావడం మరో విశేషం. మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం బంగ్లాదేశ్ యువ క్రికెటర్ నహీద అక్తర్.. సహచర క్రికెటర్ ఫర్జానా హాక్, పాక్ స్పిన్నర్ సైదా ఇక్బాల్ నుంచి పోటీ ఎదుర్కొంది. అయితే నవంబర్ నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు (14.14 సగటున 7 వికెట్లు) గానూ నహీద ఈ అవార్డును ఎగరేసుకుపోయింది. విండీస్‌తో సిరీస్‌లో నహీద ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తొలి బంగ్లాదేశీ మహిళా క్రికెటర్ నహీదానే కావడం విశేషం. -
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో వరల్డ్‌కప్ హీరోలు
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో వన్డే వరల్డ్‌కప్ 2023 హీరోలు పోటీపడుతున్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా (భారత్) ప్రకటించబడ్డారు. ఈ ముగ్గురి ఆటగాళ్ల హవా అక్టోబర్ నెలతో పాటు ప్రస్తుత మాసంలోనూ (నవంబర్) కొనసాగుతుంది. ప్రపంచకప్‌లో ఈ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్నారు. అక్టోబర్ 5న మొదలైన వరల్డ్‌కప్ 2023లో డికాక్ ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రచిన్ రవీంద్ర సైతం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీల సాయంతో 523 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. Here are the Men's and Women's 'ICC Player of the Month nominees for October 2023. pic.twitter.com/0tK6mbq1s0 — CricTracker (@Cricketracker) November 7, 2023 బుమ్రా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి, వరల్డ్‌కప్ అత్యధిక వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ అక్టోబర్ నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలతో పాటు మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్లను కూడా ప్రకటించింది. మహిళల విభాగంలో వెస్టిండీస్ హేలీ మాథ్యూస్, బంగ్లాదేశ్ నహీద అక్తర్, న్యూజిలాండ్ అమేలయా కెర్ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఘోర పరాజయాలను మూటగట్టుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఎలిమినేషన్‌కు గురయ్యాయి. నెదర్లాండ్స్ అధికారికంగా ఎలిమినేట్ కానప్పటికీ, సెమీస్ అవకాశాలు దాదాపుగా లేనట్లే.