టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను జైశ్వాల్‌కు ఈ అవార్డు దక్కింది. స్వదేశలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత నెలలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడిన యశస్వీ 112 సగటుతో ఏకంగా 560 పరుగులు చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లలో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 209 పరుగులు చేసిన జైశ్వాల్.. రాజ్‌కోట్ టెస్టులో 214 పరుగులతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ సిరీస్‌లో జైశ్వాల్ ఏకంగా 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
కాగా ఈ అవార్డు కోసం జైశ్వాల్‌తో పాటు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక పోటీపడ్డారు. కానీ ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన జైశ్వాల్‌నే ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఎంపికైంది. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సదర్లాండ్ అద్భుతంగా రాణించింది.
చదవండి: వరల్డ్‌కప్ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కఠిన నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ
Presenting the ICC Player of the Month for February 🙌
— BCCI (@BCCI) March 12, 2024
Congratulations, Yashasvi Jaiswal 👏👏
🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ
Comments
Please login to add a commentAdd a comment