శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ తన అద్బుత సెంచరీతో ఆదుకున్నాడు.
162 బంతుల్లో 13 ఫోర్లతో రూట్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్‌కు ఇది 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తన సొంత గడ్డపై 20వ టెస్టు సెంచరీ కాగా.. లార్డ్స్‌లో ఆరో శతకం. ఇక సెంచరీతో మెరిసిన రూట్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
రూట్ సాధించిన రికార్డులు ఇవే...
టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ క్రికెటర్ అలెస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్‌ల్లో 33 సెంచరీలు చేయగా.. రూట్ కేవలం 145 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. అతడు మరో సెంచరీ సాధిస్తే కుక్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
అదే విధంగా ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 11వ స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) ఆగ్రస్ధానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. రూట్ ఇప్పటివరకు తన సొంతగడ్డపై 6569* పరుగులు చేశాడు. ఇంతకుముందు రికార్డు కుక్(6568) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment