వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో మరో ఘోర ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను శ్రీలంక చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లంక బ్యాటర్లలో నిస్సాంక(77 నాటౌట్), సమరవిక్రమ(65 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక లంక చేతిలో ఓటమిపాలైన ఇంగ్లీష్ జట్టు తమ సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది.
రషీద్ చెత్త రనౌట్..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు అదిల్ రషీద్ విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్‌లో ఆఖరి బంతిని మహేష్ థీక్షణ వైడ్‌గా సంధించాడు. అయితే వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న అదిల్ రషీద్ కాస్త క్రీజును వదిలి బయటకు వచ్చాడు. సరిగ్గా ఇక్కడే మెండీస్ తన తెలివితేటలను ఉపయోగించాడు.
అదిల్ రషీద్ క్రీజు బయట ఉండడం గమనించిన మెండీస్.. బంతని నాన్‌స్ట్రైక్ వైపు త్రో చేసి స్టంప్స్‌ను గిరాటేశాడు. కాగా మెండిస్ తన గ్లోవ్ తీసి మరి త్రో చేశాడు. అంతసమయం ఉన్నప్పటికీ రషీద్ నెమ్మదిగా వెనుక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు.
బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి రషీద్ క్రీజుకు కాస్త దూరంలో ఉన్నాడు. దీంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో బద్దకంగా వ్యవహరించిన రషీద్ భారీ మూల్యం చెల్లించకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చదవండి: WC 2023: పొరపాటు చేయలేదు.. అయినా గర్వపడుతున్నాం.. మాది చెత్త టీమ్ కాదు: బట్లర్
Comments
Please login to add a commentAdd a comment