గాలే: ఇంగ్లండ్- శ్రీలంకల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సోమవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అంటే పడిచచ్చే ఒక అభిమానికి ఆ జట్టు కెప్టెన్ జో రూట్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఈసీబీ ఇంగ్లండ్ క్రికెట్ డై హార్డ్ ఫ్యాన్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. చదవండి: వీరాభిమాని నం.1
వివరాలు.. రాబర్ట్ లుయీస్ అనే వ్యక్తి క్రికెట్ అంటే అమితమై ప్రేమ.. అందునా ఇంగ్లండ్ జట్టు అంటే విపరీతమైన ప్రేమను చూపించేవాడు. కరోనాకు ముందు ఇంగ్లండ్ జట్టు ఎక్కడా పర్యటించినా రాబర్ట్ అక్కడికి వెళ్లి లైవ్‌లో మ్యాచ్‌లను ఆస్వాధించేవాడు.. అంతేగాక వీలు చిక్కినప్పుడల్లా క్రికెటర్లను కలిసేవాడు. కానీ కరోనా సంక్షోభంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. లాక్‌డౌన్ తర్వాత క్రికెట్ ప్రారంభమైనా.. మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇంగ్లండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలుసుకున్న రాబర్ట్ లుయీస్ 10 నెలల ముందే శ్రీలంక చేరుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్- శ్రీలంక టెస్ట్ సిరీస్ ప్రారంభం అయింది. అయితే మైదానంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో అతన్ని అనుమతించలేదు. ఎలాగైనా మ్యాచ్‌ను చూడాలని భావించిన రాబర్డ్ ఈసీబీ అధికారులతో మాట్లాడి ఒప్పించాడు. గాలే మైదానానికి ఆనుకొని ఉన్న ఒక కోటపై కూర్చొని టెస్టు మ్యాచ్‌ను చూశాడు. కాగా తొలి టెస్టు మ్యాచ్‌లో లంకపై విజయం సాధించిన అనంతరం సంబరాలు చేసుకుంటున్న ఇంగ్లండ్ జట్టును కోటపై నుంచే చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇది గమనించిన ఈసీబీ అధికారులు రాబర్ట్‌కు ఒక సువర్ణవకాశం కల్పించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స్వయంగా ఫోన్ చేసి రాబర్ట్‌తో మాట్లాడాడు.
'హాయ్ రాబర్ట్.. 10 నెలల విరామం తర్వాత నిన్ను ఈ కోటపై చూడడం ఆనందంగా ఉంది. ఇంతకాలం మేం ఎక్కడ పర్యటించినా మా వెంటే ఉండి ప్రోత్సహించావు. మీ అభిమానానికి థ్యాంక్స్ రాబర్ట్. ఇంగ్లండ్ జట్టుతో ఇంతకాలం నువ్వు సాగించిన జర్నీ మాకు ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలోనూ ఇంత కష్టపడి మా ఆటను చూడడానికి వచ్చిన నీకు కృతజ్ఞతలు తప్ప ఇంకేమి ఇవ్వలేము. బయో బబూల్ వాతావరణం నేపథ్యంలో నిన్ను మా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం లేదు. అందుకే ఈరోజును రాండీ కాడిక్ డ్రింక్‌తో ఎంజాయ్ చేయ్.. మిస్ యూ లాట్.. రాబర్డ్ లుయీస్ అంటూ రూట్ ఫోన్‌కాల్ ముగించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఈసీబీ తన ట్విటర్‌లో షేర్ చేసింది.చదవండి: 'అంతా బాగుంది.. నోబాల్స్ జీర్ణించుకోలేకపోతున్నా'
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 135 పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 421 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో లంక జట్టు 359 పరుగులకు ఆలౌట్ కావడంతో 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన కెప్టెన్ జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
We massively missed @TheBarmyArmy here and thank you for all your support back home.
— Joe Root (@root66) January 18, 2021
But a special thanks to @elitebandwagon up on the Fort! Incredible effort and the whole team really appreciated it 👏 https://t.co/5XAVTVGIWn
Comments
Please login to add a commentAdd a comment