శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై లంకతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మాంచెస్టర్ వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభం కానుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును సోమవారం ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు అవకాశం ఇచ్చింది. కాగా బెన్ స్టోక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో ఓలీ పోప్ సారథిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడికి డిప్యూటీగా బ్రూక్‌ను ఎంపిక చేసింది.
ఈ జట్టులో నలుగురు పేసర్లు మార్క్ వుడ్, గుస్ అట్కిన్సన్, క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్స్‌లకు చోటిచ్చింది. కాగా గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌కు చివరగా ఆడిన పాట్స్ ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ జట్టులో స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు కూడా స్థానం దక్కింది. ఇక డాన్‌లారెన్స్, బెన్ డకెట్ ఓపెనర్లుగా దిగనుండగా.. మిడిలార్డర్‌లో ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ జామీ స్మిత్ ఆడనున్నారు.
మూడు టెస్టులు.. షెడ్యూల్ ఇదే
ఆగష్టు 21- 25 వరకు మాంచెస్టర్‌లో తొలి టెస్టు, ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు లండన్(లార్డ్స్)లో రెండో టెస్టు, సెప్టెంబరు 6- సెప్టెంబరు 10 వరకు లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం ఇంగ్లండ్- శ్రీలంక టెస్టులు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆరంభం కానున్నాయి.
శ్రీలంకతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు
డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.
Comments
Please login to add a commentAdd a comment