England Breaks Records Vs SL Match T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటవడంతో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టింది. జాస్ బట్లర్ సెంచరీతో మొదలుకొని.. విజయం సాధించడం వరకు ఇంగ్లండ్ సాధించిన రికార్డులు పరిశీలిద్దాం.
చదవండి: టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్
►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ (43 విజయాలు) రికార్డు నెలకొల్పాడు. 42 విజయాలతో అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎమ్మెస్ ధోని (భారత్) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును మోర్గాన్ బద్దలు కొట్టాడు.
►టి20 ప్రపంచకప్‌లలో ఇది 9వ సెంచరీ. బట్లర్‌కు ముందు గేల్ (2 సార్లు), మెకల్లమ్, అహ్మద్ షహజాద్, రైనా, హేల్స్, తమీమ్, జయవర్ధనే ఈ ఘనత సాధించారు.
►అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా బట్లర్ రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో గత ఏడాది హీథెర్ నైట్ ఇంగ్లండ్ తరఫున ఈ ఘనత సాధించింది.
►అంతర్జాతీయ టి20ల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్ బట్లర్. గతంలో అలెక్స్ హేల్స్ (116 నాటౌట్; శ్రీలంకపై 2014లో), డేవిడ్ మలాన్ (103 నాటౌట్; న్యూజిలాండ్‌పై 2019లో), లివింగ్‌స్టోన్ (103; పాకిస్తాన్‌పై 2021లో) ఈ ఘనత సాధించారు.
►టి20 ప్రపంచకప్‌లోని ఓ మ్యాచ్‌లో అత్యధిక బంతులు ఆడిన బ్యాటర్‌గా జోస్ బట్లర్ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో బట్లర్ 67 బంతులు ఎదుర్కొన్నాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ (66 బంతులు; భారత్‌పై 2010లో), మర్లోన్ సామ్యూల్స్ (66 బంతులు; ఇంగ్లండ్‌పై 2016లో) పేరిట సంయుక్తంగా ఉంది.
చదవండి: T20 World Cup 2021 IND Vs NZ: కోహ్లి వ్యూహాలను ఏకి పారేసిన గంభీర్
Comments
Please login to add a commentAdd a comment