శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 204/6తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక.. 326 పరుగులకు ఆలౌటైంది.
కమిందు మెండిస్ (183 బంతుల్లో 113; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో రాణించి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 57.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
మాజీ కెప్టెన్ జో రూట్ (128 బంతుల్లో 62 నాటౌట్; 2 ఫోర్లు), జేమీ స్మిత్ (48 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్సర్), డాన్ లారెన్స్ (54 బంతుల్లో 34; 2 ఫోర్లు, ఒక సిక్సర్), హ్యారీ బ్రూక్ (68 బంతుల్లో 32; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 236/10
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్:358/10
శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్:326/10
ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్:205/5
Comments
Please login to add a commentAdd a comment