లార్డ్స్ వేదికగా శ్రీలకంతో జరిగిన రెండో టెస్టులో 190 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 483 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 292 పరుగులకు ఆలౌటైంది.
లంక బ్యాటర్లలో కరుణ్‌రత్నే(55), చందీమాల్(58), దనుజంయ డి సిల్వా(50) హాఫ్ సెంచరీలతో పోరాడినప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో గౌస్ అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా.. క్రిస్ వోక్స్, స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 251 పరుగులకే ఆలౌటైంది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు 231 పరుగుల భారీ లీడ్ లభించింది. ఈ ఆధిక్యాన్ని కలుపునకుని 483 పరుగుల భారీ టార్గెట్‌ను లంకేయులు ముందు ఇంగ్లీష్ జట్టు ఉంచింది.
ఈ కొండంత లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక విఫలమైంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 427 పరుగులు చేయగా.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీలతో మెరిశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసిన జో.. రెండో ఇన్నింగ్స్‌లో 103 రన్స్‌తో సత్తాచాటాడు. అదేవిధంగా ఇంగ్లీష్ పేస్ బౌలర్ అట్కిన్సన్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎనిమిదో స్ధానంలో వచ్చి సెంచరీతో చెలరేగిన అట్కిన్సన్.. బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఓవరాల్‌గా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment