రోహిత్‌ శర్మను అధిగమించిన జో రూట్‌.. 44 నెలల్లో 16 సెంచరీలు | Joe Root Crossed Rohit Sharma In Most International Centuries By Current Players, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మను అధిగమించిన జో రూట్‌.. 44 నెలల్లో 16 సెంచరీలు

Published Fri, Aug 30 2024 9:23 AM | Last Updated on Fri, Aug 30 2024 4:10 PM

Joe Root Crossed Rohit Sharma In Most International Centuries By Current Players

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఈ సెంచరీ రూట్‌కు 33వ టెస్ట్‌ సెంచరీ. మూడు ఫార్మాట్లలో కలిపితే 49వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో రూట్‌ రెండో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. తాజా సెంచరీ చేసే క్రమంలో రూట్‌ రోహిత్‌ శర్మను (48 సెంచరీలు) అధిగమించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీల రికార్డు విరాట్‌ కోహ్లి (80) పేరిట ఉంది. 

రూట్‌ ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ అలిస్టర్‌ కుక్‌ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో రూట్‌ (33), కుక్‌ (33), కెవిన్‌ పీటర్సన్‌ (23) టాప్‌-3లో ఉన్నారు. 2020లో కేవలం 17 టెస్ట్‌ సెంచరీలు మాత్రమే చేసిన రూట్‌.. 44 నెలల వ్యవధిలో ఏకంగా 16 సెంచరీలు బాదాడు. ఫాబ్‌ ఫోర్‌గా పిలువబడే రూట్‌, స్మిత్‌, విరాట్‌, కేన్‌లలో రూట్‌ అత్యధికంగా 33 సెంచరీలు కలిగి ఉన్నాడు. కేన్‌, స్మిత్‌ చెరో 32 సెంచరీలు చేయగా.. విరాట్‌ 29 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే, లార్డ్స్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 7 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. రూట్‌ 143 పరుగులు చేసి ఔట్‌ కాగా.. గస్‌ అట్కిన్సన్‌ (74), మాథ్యూ పాట్స్‌ (20) క్రీజ్‌లో ఉన్నారు. బెన్‌ డకెట్‌ (40), హ్యారీ బ్రూక్‌ (33), జేమీ స్మిత్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, మిలన్‌ రత్నాయకే, లహీరు కుమార తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్‌ జయసూర్య ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement