ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు రాణించిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.
128 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో అతడు 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంలో ఈ వెటరన్ తన వంతు పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఇంగ్లండ్ చిత్తుచేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి ఇంగ్లండ్ వెళ్లింది.
జో రూట్ అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 144 టెస్టులు ఆడిన రూట్.. 64 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలాన్ బోర్డర్(63), భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(63)ల పేరిట సంయుక్తంగా ఉండేది.
తాజా మ్యాచ్‌తో వీరిద్దరని అధిగమించి మూడో స్ధానానికి రూట్ చేరుకున్నాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(68) అగ్రస్ధానంలో ఉండగా.. విండీస్ లెజెండ్ చంద్రపాల్(66) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రూట్ కెరీర్‌లో 32 టెస్టు సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment