మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక అరంగేట్ర ఆటగాడు మిలన్ రత్నాయకే సత్తాచాటాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు తన అద్భుత ఇన్నింగ్స్‌తో అదుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 135 బంతులు ఎదుర్కొన్న రత్నాయకే .. 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 పరుగులు సాధించాడు. ఇక తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన రత్నాయకే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే డెబ్యూ మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరుపరుగులు చేసిన ఆటగాడిగా రత్నాయకే రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ బల్వీందర్ సంధు పేరిట ఉండేది.
బల్వీందర్ 1983లో పాకిస్థాన్‌పై 71 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో 41 ఏళ్ల బల్వీందర్ సంధు రికార్డును రత్నాయకే బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 236 పరుగులకే ఆలౌటైంది.
శ్రీలంక బ్యాటర్లలో రత్నాయకే(72)తో పాటు కెప్టెన్ దనుంజయ డిసిల్వా(74) పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ డకెట్ (13), డేనియల్ లారెన్స్ (9) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment