శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. ది హండ్రడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టోక్స్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.
పేసర్ ఆలీ రాబిన్‌సన్ బౌలింగ్ లో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో స్టోక్స్ తొడ కండరాలు పట్టేశాయి. ఈ క్రమంలో పరిగెత్తలేక గ్రౌండ్ లోనే పడిపోయి వైద్య సహాయాన్ని కోరాడు. దీంతో ఫిజియోలు వెంటనే పరిగెత్తుకొచ్చి అతనికి చికిత్స అందించారు.
అనంతరం అస్పత్రికి తీసుకువెళ్లి స్కాన్ చేయగా అతడి గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో టెస్టు సిరీస్‌తో పాటు ఈ వేసవిలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికి ఈ దిగ్గజ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ దూరమయ్యాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్..
ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్ ఓలీ పోప్ ఎంపికయ్యాడు. స్టోక్సీ డిప్యూటీగా ఉన్న పోప్‌కు మరోసారి కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. అయితే పోప్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ఇంకా స్టోక్స్ స్ధానాన్ని మాత్రం భర్తీ చేయలేదు. ఇక ఇంగ్లండ్-శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. స్టోక్స్ తిరిగి మళ్లీ పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో వచ్చే అవకాశముంది.
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..
ఓలీ పోప్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జోర్డన్ కాక్స్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
Comments
Please login to add a commentAdd a comment