ఇంగ్లండ్ తాత్కాలిక టెస్టు సారథి ఓలీ పోప్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. లండన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. వర్షం అంతరాయం కలిగించిన తొలి రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను పోప్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.
జో రూట్(13) విఫలమైనప్పటకి పోప్ మాత్రం దంచి కొట్టాడు. 103 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అతడితో పాటు క్రీజులో హ్యారీ బ్రూక్(8) ఉన్నాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కాగా పోప్‌కు ఇది 7వ టెస్టు సెంచరీ.
సరికొత్త చరిత్ర..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పోప్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తొలి 7 సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్‌గా పోప్ రికార్డులకెక్కాడు.
పోప్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు సాధించిన ప్రతి సెంచరీ ఆరు వేర్వేరు మైదానాల్లో వచ్చినివే కావడం విశేషం. 2020లో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు సెంచరీ చేసిన పోప్.. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, భారత్, వెస్టిండీస్, శ్రీలంకపై శతకాలు నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment