శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయకారణంగా లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ది హాండ్రడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్‌కు బెన్ స్టోక్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం(ఆగస్టు 11) ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సింగిల్ కోసం వేగంగా పరిగెత్తడంతో స్టోక్సీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో తీవ్రమైన నొప్పితో అతడు విల్లవిల్లాడు.
వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఫిజియో సాయంతో స్టోక్స్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయంపై నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ కెప్టెన్, సహచరుడు హ్యారీ బ్రూక్ అప్‌డేట్ ఇచ్చాడు.
"ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ స్టోక్సీ గాయపడ్డాడు. అతడిని సోమవారం(ఆగస్టు 12) స్కానింగ్‌కు తీసుకువెళ్లనున్నాము. ఆ తర్వాత స్టోక్స్ గాయంపై ఓ అంచనా వస్తుంది. అయితే అతడు మాత్రం తీవ్రమైన నొప్పితో బాధపడతున్నాడు. నిజంగా మాకు గట్టి ఎదురు దెబ్బ" అని బ్రూక్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌కు ఇప్పటికే స్టార్ ఓపెన్ జాక్ క్రాలీ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు కెప్టెన్ స్టోక్స్ కూడా గాయపడటం ఇంగ్లండ్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది
Comments
Please login to add a commentAdd a comment