పాకిస్తాన్ పర్యటనకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బౌలర్ జోష్ హల్(Josh Hull).. పాక్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్దారించింది. తొడ కండరాల నొప్పి కారణంగా.. పాకిస్తాన్ టూర్‌కు జోష్ దూరమయ్యాడని తెలిపింది. అతడు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించింది.
అరంగేట్రంలో రాణించి
కాగా లీసస్టర్‌ఫైర్‌కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ జోష్ హల్ ఇటీవలే ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. సొంతగడ్డపై శ్రీలంకతో ఓవల్ టెస్టు(సెప్టెంబరు 6, 2024) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
గాయం కారణంగా
అయితే, ఈ మ్యాచ్ తర్వాత జోష్ తొడ కండరాల నొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ నాటికి అతడు ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించిన సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. కానీ.. జోష్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 16 మంది సభ్యుల జట్టుతోనే పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆరు ఫీట్ల ఏడు అంగుళాల ఎత్తు ఉండే జోష్ హల్‌కు ఇంగ్లండ్ బోర్డు ప్రత్యామ్నాయ బౌలర్‌ను ప్రకటించకపోవడం ఇందుకు కారణం.
వుడ్ కూడా లేడు
కాగా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ పేస్ దళంలో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. అయితే, మార్క్ వుడ్ శ్రీలంకతో సిరీస్ తర్వాత ఈ ఏడాది తదుపరి సిరీస్‌లన్నింటికి దూరం కాగా.. ఇప్పుడు జోష్ కూడా అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇక అక్టోబరు 7 నుంచి 28 వరకు పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. ముల్తాన్, రావల్పిండి ఇందుకు వేదికలు.
పాకిస్తాన్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.
చదవండి: టీ10 క్రికెట్‌లో సంచలనం.. స్కాట్లాండ్ క్రికెటర్ సుడిగాలి శతకం
Comments
Please login to add a commentAdd a comment