Pak vs Eng 3rd Test: Ben Stokes equals Virat Kohli's record - Sakshi
Sakshi News home page

Ben Stokes: పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్‌.. అరుదైన జాబితాలో చోటు

Published Wed, Dec 21 2022 10:39 AM

Pak Vs Eng 3rd Test: Ben Stokes Equals Virat Kohli Record Joins List - Sakshi

Pakistan vs England, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవాన్ని మిగిల్చి ఇంగ్లండ్‌ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కరాచీలో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో బెన్‌ స్టోక్స్‌ బృందం ఆతిథ్య పాక్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా స్వదేశంలో ఇలా క్లీన్‌స్వీప్‌ కావడం పాక్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. 

కోహ్లి రికార్డు సమం
అదే విధంగా.. సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్టులు ఓడిన మొదటి పాకిస్తాన్‌ కెప్టెన్‌ కూడా బాబర్‌ ఆజం కావడం విశేషం. ఇలా మూడో టెస్టుతో పాక్‌ ఖాతాలో చెత్త రికార్డులు నమోదు కాగా.. ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ మాత్రం అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా పేరొందిన విరాట్‌ కోహ్లి రికార్డును సమం చేశాడు.

టెస్టుల్లోనూ దూకుడుగా
జో రూట్‌ తర్వాత ఇంగ్లండ్‌ టెస్టు పగ్గాలు చేపట్టిన స్టోక్స్‌.. జట్టును విజయపథంలో నడుపుతున్న విషయం తెలిసిందే. కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌తో కలిసి సంప్రదాయ క్రికెట్‌లోనూ దూకుడైన ఆటకు మారు పేరుగా జట్టును మార్చి మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. 

ఈ క్రమంలో పాక్‌తో మూడో టెస్టులో ఇంగ్లండ్‌ గెలవడంతో ఈ ఏడాది స్టోక్స్‌ ఖాతాలో 9(ఆడిన 10 మ్యాచ్‌లలో) విజయాలు చేరాయి. తద్వారా క్యాలెండర్‌ ఇయర్‌లో ఈ ఘనత సాధించిన టెస్టు కెప్టెన్ల జాబితాలో స్టోక్స్‌ చోటు సంపాదించాడు. ఈ ఫీట్‌ నమోదు చేసిన ఏడో సారథిగా నిలిచాడు.

అంతకుముందు గ్రేమ్‌ స్మిత్‌(సౌతాఫ్రికా), రిక్కీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా), స్టీవ్‌ వా(ఆస్ట్రేలియా), మైకేల్‌ వాన్‌(ఇంగ్లండ్‌), క్లైవ్‌ లాయిడ్‌(వెస్టిండీస్‌), విరాట్‌ కోహ్లి(ఇండియా) ఈ ఘనత సాధించారు.

సొంతగడ్డపై ఓటమి తప్పలేదు
పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3–0తో సొంతం చేసుకుంది. చివరి టెస్టులో గెలుపు కోసం మ్యాచ్‌ నాలుగో రోజు మంగళవారం ఇంగ్లండ్‌ మరో 55 పరుగులు చేయాల్సి ఉండగా... 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ (82 నాటౌట్‌; 12 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (35 నాటౌట్‌; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు అభేద్యంగా 73 పరుగులు జోడించి ఆటను ముగించారు.

సిరీస్‌లోని తొలి టెస్టులో 74 పరుగులతో, రెండో టెస్టులో 26 పరుగులతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. జట్టులో ఇద్దరు సీనియర్‌ పేసర్లు అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్‌ లేకుండా 2007 తర్వాత ఇంగ్లండ్‌ గెలిచిన తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. 

చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్‌ ఊచకోత కొనసాగింపు
India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్‌.. ఇప్పుడు సూర్య, చహల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement