'విరాట్‌ కోహ్లిని రెచ్చగొట్టాలి.. అతడి ఈగో తో ఆడుకోవాలి' | Monty Panesar urges Ben Stokes to play mind games with Virat Kohli | Sakshi
Sakshi News home page

IND vs ENG: 'విరాట్‌ కోహ్లిని రెచ్చగొట్టాలి.. అతడి ఈగో తో ఆడుకోవాలి'

Published Sat, Jan 20 2024 3:49 PM | Last Updated on Sat, Jan 20 2024 4:07 PM

 Monty Panesar urges Ben Stokes to play mind games with Virat Kohli - Sakshi

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ హైవోల్టేజ్‌ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌  మాంటీ పనేసర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితో మైండ్‌ గేమ్స్‌ ఆడాలని, అతడి ఈగోపై దెబ్బ కొట్టాలని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను పనేసర్‌ సూచించాడు. 

విరాట్‌తో మైండ్‌ గేమ్స్‌ ఆడాలి. అతడిని మానసికంగా దెబ్బతీయాలి. గత 10 ఏళ్లగా ఐసీసీ టైటిల్స్‌ను గెలవకపోయిన విషయాన్ని అతడికి పదేపదే గుర్తు చేయాలి.  ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కి వచ్చేసరికి మీరు ఓడిపోతారు, ఛోకర్స్‌ అంటూ అతడిని స్లెడ్జ్‌  చేయాలి. అప్పుడు విరాట్‌ తన ఏకగ్రాతను కోల్పోతాడు.

దీంతో అతడిని అవుట్‌ చేయడం సులభం అవుతుందని ఇండియా.కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్‌ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ సిరీస్‌లో కోహ్లికి, ఇంగ్లండ్‌ వెటరన్‌ జేమ్స్‌ అండర్సన్‌కు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని పనేసర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో విరాట్‌పై పనేసర్‌కు మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో కోహ్లిని అండర్సన్‌ ఇప్పటివరకు 7 సార్లు ఔట్‌ చేశాడు.
చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్‌ మాలిక్‌!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement