Monty Panesar
-
'విరాట్ కోహ్లిని రెచ్చగొట్టాలి.. అతడి ఈగో తో ఆడుకోవాలి'
స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ హైవోల్టేజ్ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో మైండ్ గేమ్స్ ఆడాలని, అతడి ఈగోపై దెబ్బ కొట్టాలని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పనేసర్ సూచించాడు. విరాట్‌తో మైండ్ గేమ్స్ ఆడాలి. అతడిని మానసికంగా దెబ్బతీయాలి. గత 10 ఏళ్లగా ఐసీసీ టైటిల్స్‌ను గెలవకపోయిన విషయాన్ని అతడికి పదేపదే గుర్తు చేయాలి. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కి వచ్చేసరికి మీరు ఓడిపోతారు, ఛోకర్స్ అంటూ అతడిని స్లెడ్జ్ చేయాలి. అప్పుడు విరాట్ తన ఏకగ్రాతను కోల్పోతాడు. దీంతో అతడిని అవుట్ చేయడం సులభం అవుతుందని ఇండియా.కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ సిరీస్‌లో కోహ్లికి, ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్‌కు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని పనేసర్ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో విరాట్‌పై పనేసర్‌కు మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో కోహ్లిని అండర్సన్ ఇప్పటివరకు 7 సార్లు ఔట్ చేశాడు. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! -
'అతడు చాలా డేంజర్.. ఇంగ్లండ్ గెలవాలంటే అదొక్కటే మార్గం'
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2023-25లో తొలి హోమ్ సిరీస్‌కు టీమిండియా సన్నద్దం కానుంది. స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. జనవరి 25న హైదరాబాద్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్లో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్‌ను భారత్ ఏ విధంగా బ్రేక్‌లు వేస్తుందో వేచి చూడాలి. అయితే టెస్టుల్లో సొంత గడ్డపై భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. 2013 నుంచి స్వదేశంలో 46 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. కానీ ఒక్క టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోలేదు. కాగా ఈ హైవోల్టేజ్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. "భారత బ్యాటర్లు స్పిన్‌కు అద్బుతంగా ఆడుతారు. టర్నింగ్ పిచ్‌లపై వారు ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ.. స్పిన్ పిచ్‌లపై పండగ చేసుకుంటాడు. టర్నింగ్ పిచ్‌లలో డాన్ బ్రాడ్‌మాన్‌లా హిట్‌మ్యాన్ ఆడుతాడు. అతడి రికార్డు అద్బుతం. టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే రోహిత్‌ను ముందుగానే ఔట్ చేయాలి. రోహిత్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తే భారత్ కొంచెం ఒత్తిడిలోకి వెళ్తుందని" హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో రోహిత్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. 36 ఇన్నింగ్స్‌లలో 66.73 సగటుతో 2002 పరుగులు చేశాడు. చదవండి: AUS vs PAK: 'అతడు ఓపెనర్‌గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే' -
అందుకే బీసీసీఐ కోహ్లిని తప్పించే సాహసం చేయలేకపోతుంది..!
క్రికెట్ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఏ ఇద్దరు ముగ్గరు కలిసినా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్ విషయమే చర్చకు వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ చేసి దాదాపు 1000 రోజులు కావస్తుండటంతో అభిమానులు, విశ్లేషకులు, మాజీలు తమ తమ అభిప్రాయాలను రకరకాల వేదికలపై షేర్ చేస్తున్నారు. కొందరు గణాంకాలు చూపుతూ కోహ్లికి అనుకూలంగా మాట్లడుతుంటే.. మరికొందరు రన్ మెషీన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా కోహ్లి పేలవ ఫామ్‌తో టీమిండియాలో కొనసాగడంపై ఇంగ్లండ్ మాజీ బౌలర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి వరుసగా విఫలమవుతున్నా బీసీసీఐ అతనికి వరుస అవకాశాలు కల్పిస్తున్న విషయంలో కొత్త కోణాన్ని బయటపెట్టాడు. విశ్వవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ కలిగిన కోహ్లిపై వేటు వేస్తే స్పాన్సర్ల రూపంలో బీసీసీఐ భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే బీసీసీఐ కోహ్లిపై వేటు వేసే సాహసం చేయలేకపోతుందని వివాదాస్పద ఆరోపణలు చేశాడు. డబ్బు కోసమే బీసీసీఐ ఇదంతా చేస్తుందని, దీని వల్ల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా విజయావకాశాలు దెబ్బ తింటాయని అన్నాడు. కోహ్లి బీసీసీఐతో పాటు పలు బడా కంపెనీలకు ఆదాయ వనరుగా ఉన్నాడని, కోహ్లిని టీమిండియా నుంచి తప్పిస్తే సదరు కెంపెనీలు దివాలా తీస్తాయని, అందుకే బీసీసీఐ కోహ్లి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందని తెలిపాడు. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడించాడు. చదవండి: సెంచరీ కోసం కోహ్లి కూడా ఇంతలా తపించి ఉండడు.. -
రూట్‌ను ఔట్ చేయాలంటే..? సీక్రెట్‌ను రివీల్ చేసిన ఇంగ్లండ్ మాజీ బౌలర్
లండన్: ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ఎలా ఔట్ చేయాలో ఆ జట్టు మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ వెల్లడించాడు. రూట్ క్రీజులోకి రాగానే బుమ్రా, సిరాజ్‌లతో ఆఫ్ స్టంప్‌కు ఆవల పదేపదే బౌలింగ్ చేయించి విసిగించాలని సూచించాడు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రూట్ ఫ్రస్ట్రేషన్‌కు లోనై వికెట్ పారేసుకుంటాడని పేర్కొన్నాడు. బుమ్రా, సిరాజ్‌లకు బ్యాట్స్మెన్లపై ఒత్తిడి తీసుకురాగల నైపుణ్యాలు అధికంగా ఉన్నాయని ప్రశంసించాడు. వీరిద్దరూ రూట్‌ను అడ్డుకోగలరని జోస్యం చెప్పాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ కెప్టెన్‌కు ఉన్న వీక్నెస్లను రివీల్ చేశాడు. రూట్‌ను ఔట్ చేయాలంటే ఆఫ్‌స్టంప్ ఆవల, ఐదో స్టంప్ లైన్లో బంతులు వేయాలని, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఫార్ములాను అమలు చేసి సక్సెస్ అయ్యాడని పేర్కొన్నాడు. కోహ్లి ప్రణాళికను బుమ్రా చక్కగా అమలు చేశాడని కితాబునిచ్చాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా రూట్ విషయంలో ఇదే ప్రణాళికను అమలు చేస్తే టీమిండియాకు కష్టాలు తప్పినట్టేనని తెలిపాడు. రూట్‌కు బౌలింగ్ చేసేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా షార్ట్ పిచ్ బంతులు వేయొద్దని సూచించాడు. రూట్.. పుల్ షాట్లను అద్భుతంగా ఆడగలడు కాబట్టి, అతనికి షార్ట్ పిచ్ బంతులు వేయొద్దని సలహా ఇచ్చాడు. 39 ఏళ్ల పనేసర్ ఇంగ్లండ్ తరఫున 50 టెస్టులు, 26 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. కాగా, ఆతిథ్య జట్టులో ప్రస్తుతం కోహ్లీ సేనకు రూట్ పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అతను ఏకంగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 386 పరుగులు(128.66 సగటు) సాధించాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ లీడ్స్ వేదికగా ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: పంత్‌కు షాక్ ఇవ్వనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. కెప్టెన్‌గా మళ్లీ అతనే..? -
బీసీసీఐ బెట్టు.. ఆ టోర్నీపై నీలి నీడలు?
కశ్మీర్ ప్రీమియర్ లీగ్ టోర్నీ నిర్వహణపై నెమ్మదిగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కేపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. భారత్-పాక్ ‘కశ్మీర్’ వివాదాల నడుమ తలదూర్చడం తనకు ఇష్టం లేదని పనేసర్ ఓ ట్వీట్ కూడా చేశాడు. దీంతో పనేసర్ దారిలో మరికొందరు ఆటగాళ్లు పయనించే అవకాశం ఉందని, టోర్నీ జరగడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఓ భారత మీడియా హౌజ్‌తో మాట్లాడిన పనేసర్.. బీసీసీఐ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. రాజకీయాలు-ఆటలు ఒక్కటి కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు. ‘ఆడడం ఆడకపోవడం ఆటగాళ్ల ఇష్టం. నాకు ఈసీబీ(ఇంగ్లండ్ బోర్డు) నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి. అయితే ఆడితే తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటారో ఆ ఆటగాళ్లకు తెలుసు’ అంటూ పనేసర్ వ్యాఖ్యలు చేశాడు. I have decided not to participate in the KPL because of the political tensions between India and Pakistan over kashmir issues. I don't want to be in the middle of this , it would make me feel uncomfortable. #KPL2021 #Kashmir #india #Cricket #Pakistan #ENGvIND #TheHundred — Monty Panesar (@MontyPanesar) August 1, 2021 ఇక దాయాది దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్న టైంలో.. పీవోకేలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ లీగ్‌ను నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు గుర్తింపు ఇవ్వొద్దని, జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఐసీసీకు నిన్న ఒక లేఖ రాసింది కూడా. దీంతో పాక్ ప్లేయర్లు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో బీసీసీఐపై మండిపడ్డారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ ఆగదని స్పష్టం చేసింది. మరోవైపు పీవోకే లీగ్‌లో ఆడబోయే ఆటగాళ్లపై బీసీసీఐ బెదిరింపులకు పాల్పడుతోందనే, ఈ మేరకు భవిష్యత్తులో జరగబోయే టోర్నీల్లో నిషేధం విధిస్తామని ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షల్ గిబ్స్ బీసీసీఐని తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించాడు. కేపీఎల్ ఆడితే.. ఇక తనను ఏ టోర్నీలకు తీసుకోమని బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించింది. కాగా ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్ టోర్నీలో ఓవర్సీస్ వారియర్స్, ముజఫర్బాద్ టైగర్స్, రావల్కోట్ హాక్స్, బాగ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లీ లయన్స్ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాహిద్ అఫ్రిది, షాబాద్ ఖాన్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక ఈ టోర్నీ నిర్వహణకు మరో నాలుగు రోజుల టైం ఉండగా.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులోనే ఉంది. -
టీమిండియా కెప్టెన్‌గా అతనే సరైనోడు: పనేసర్
టీమిండియా సారథిని మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ట్వీ20లకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్లూటీసీ) ఫైనల్లో కొహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఓడిపోయిన తరువాత పనేసర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా భారత జట్టులో కెప్టెన్సీ మార్పుపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. రోహిత్ ముందుండి నడిపించగలడు చాలా దేశాలు వివిధ ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లను ఎంపిక చేసుకుని వాళ్ల జట్లను నడిపిస్తుండగా,భారత్,పాకిస్తాన్,న్యూజిలాండ్ దేశాలు మాత్రం అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌తో బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం విరాట్ ఒత్తిడిలో ఉన్నాడని రాబోవు 2021 ట్వీ20 ప్రపంచ కప్ దృష్ట్యా హిట్‌మ్యాన్‌కు టీమిండియా సారథ్యం బాధ్యతలు అప్పగించాలని పనేసర్ సూచించాడు. అంతేగాక రోహిత్‌కు ఐపీఎల్ లో ముంబై జట్టుకి సారథ్యం వహించి ఎన్నో విజయాలను అందించడమే గాక ఐపీఎల్లో ముంబైని ఫైనల్లో ఐదు సార్లు విజేతగా నిలిపిన ఘనత కూడా ఉందని గుర్తు చేశాడు. పొట్టి ఫార్మట్‌లో తన టీంను సమర్థవంతంగా నడిపించగల అనుభవం తనకుందని అతను ఎప్పుడో నిరూపించుకున్నాడని పనేసర్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ఆసియా కప్‌తో పాటు నిదాహాస్ ట్రోఫీలో కూడా భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఇప్పటివరకు, అతను భారత్‌కు 29 సార్లు (10 వన్డేలు, 19 టీ20 ) నాయకత్వం వహించగా, అందులో 23 (8 వన్డేలు, 15 టీ 20 ) విజయాలు ఉన్నాయి. చదవండి: WTC: కివీస్‌కు క్షమాపణలు చెప్పిన ఆసీస్ కెప్టెన్ -
విజేత టీమిండియానే: పనేసర్
లండన్: భారత్,న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌పై భారీ అంచనాలు మొదలయ్యాయి. పలువురు టీమిండియానే విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది న్యూజిలాండ్‌దే కప్ అని అభిప్రాయపడుతున్నారు. కాగా, టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ, ఆ తర్వాత జరగనున్న తమ జట్టుతో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లోనూ టీమిండియా తిరుగులేని విజయం సాధిస్తుందని ఇంగ్లండ్ మాజీ వెటరన్ స్పిన్నర్ మాంటే పనేసర్ జోస్యం చెప్పాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఇంగ్లండ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ ఇప్పటికే యూకే కు చేరుకుందని ,జూన్ మొదటి వారంలో భారత జట్టు వచ్చి చేరుతుందని తెలిపాడు. ఇటీవల మార్చిలో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడలేకపోవడం తమను ఎప్పుడూ వెంటాడుతున్న ప్రధాన సమస్య అని పనేసర్ అభిప్రాయపడ్డాడు. ఆగస్టులో ఇంగ్లండ్ పిచ్‌ల నుంచి టర్న్ లభిస్తుంటుంది. అదే జరిగితే ఇంగ్లండ్ ని ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది.ఇంగ్లండ్ టాప్ ఆర్డర్లో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ స్పిన్ని సమర్థంగా ఎదుర్కోలేరు.ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ గ్రీన్ పిచ్‌పై జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీమిండియానే ఫేవరెట్ అని పనేసర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాని దాని సొంతగడ్డపైనే ఈ ఏడాది ఆరంభంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌లో ఓడించిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ని 3-1తో చిత్తుగా ఓడించేసింది..ఆ ఉత్సాహంలో ఉన్న భారత్ జట్టు తప్పక విజయం సాధిస్తుందని పనేసర్ అభిప్రాయ పడ్డాడు. (చదవండి:నెటిజన్లను ఆకర్షిస్తున్న సంజన డాన్స్ వీడియో) -
నేనే కోహ్లినైతే వారి బదులు అశ్విన్, జడ్డూలను తీసుకుంటా..
లండన్: ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినైతే టీ20 ప్రపంచకప్ జట్టులోకి చహల్, కుల్దీప్ యాదవ్‌లను అస్సలు తీసుకోనని, వారి స్థానాల్లో సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లకు అవకాశం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై చహల్-కుల్దీప్ల కంటే అనుభవజ్ఞులైన జడేజా-అశ్విన్‌లవైపు మొగ్గుచూపడమే భారత్‌కు మంచిదని, ఈ ఇద్దరు స్పిన్నర్లు ఆల్‌రౌండర్లనే విషయం మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుత భారత్ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ.. స్పిన్నర్ల విభాగమే కాస్త కలవరపెడుతోందని ఆయన తెలిపాడు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్, చహల్ కొనసాగుతున్నారని, ఈ ఫార్మట్‌లో వీరి ప్రదర్శన అంత మెరుగ్గా లేకపోవడం వల్లనే తాను ఈ తరహా వ్యాఖ్యలు చేశానని పనేసర్ వెల్లడించాడు. గత 10 మ్యాచ్‌ల్లో చహల్ కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టగా, కుల్దీప్ ఆ మాత్రం ప్రభావం కూడా చూపలేకపోయాడన్నాడు. ఈ నేపథ్యంలోనే అశ్విన్-జడేజాలకు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్కు ఆయన సూచించాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ చహల్, కుల్దీప్కు అగ్ని పరీక్షలాంటిదని, ఇందులో విఫలమైతే వారి టీ20 ప్రపంచకప్ బెర్త్‌లపై సందిగ్ధత నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేకపోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
‘అదే జరిగితే కెప్టెన్‌గా కోహ్లి కెరీర్ ముగిసినట్లే’
న్యూఢిల్లీ: పర్యాటక ఇంగ్లండ్ జట్టు చేతిలో టీమిండియాకు జరిగిన ఘోర పరాభవానికి బాధ్యున్ని చేస్తూ.. భారత జట్టు సారధి విరాట్ కోహ్లీపై ముప్పేట దాడి మొదలైంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో జట్టు సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మాజీ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో(2019/2020లో న్యూజిలాండ్ చేతిలో రెండు టెస్టులు, ఇటీవల ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఓటమి) ఓటమి పాలు కావడంతో అతని కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ ఇంగ్లండ్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 13 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరగబోయే రెండో టెస్టులో భారత జట్టు ఓటమి పాలైతే, కెప్టెన్‌గా కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనని పనేసర్ విమర్శించారు. కోహ్లీ గైర్హాజరీలో(గత ఆసీస్ పర్యటనలో) టీమిండియాను అత్యంత సమర్ధవంతంగా ముందుండి నడిపించిన అజింక్య రహానేను టెస్టు కెప్టెన్‌గా నియమించాలన్న డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కోహ్లీ నిస్సందేహంగా ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో అతని సారధ్యంలో భారత జట్టు దారుణంగా విఫలం కావడానికి కోహ్లీనే నైతిక బాధ్యత వహించాలని పనేసర్ డిమాండ్ చేశాడు. ఓవైపు సహచరుడు రహానే కెప్టెన్‌గా సక్సెస్ అవుతుండటంతో కోహ్లీ ఒత్తిడిలో కూరుకుపోయాడని అతను వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌కు బదులు షాదాబ్ నదీమ్‌ను ఎంపిక చేయడాన్ని పనేసర్ తప్పుపట్టాడు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకబడి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను క్లిష్టం చేసుకోగా, టీమిండియాపై విజయంతో పర్యాటక ఇంగ్లండ్ జట్టు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు మార్గం సుగమమం చేసుకోవడంతో పాటు సొంత గడ్డపై టీమిండియా 14 వరుస విజయాల జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. -
ఆ ట్రోఫీ గెలవకుంటే కోహ్లి తప్పుకోవాల్సిందే
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న టీ20, వన్డే ప్రపంచకప్‌లను టీమిండియా గెలవకపోతే కోహ్లి కెప్టెన్సీ పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపాడు. కోహ్లి సారధ్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లు చాలానే గెలిచినా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో మాత్రం విఫలమయింది. ఈ నేపథ్యంలోనే పనేసర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు.' రానున్న రోజుల్లో రెండు మేజర్ టోర్నీలు ఇండియాలోనే జరగనున్నాయి. అందులో ఒకటి టీ20 ప్రపంచకప్.. మరొకటి వన్డే ప్రపంచకప్.. ఈ రెండింటింలో కనీసం ఒక్కదాన్నయినా కోహ్లి కెప్టెన్సీలో గెలవాల్సి ఉంటుంది. 2017 నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కోహ్లి ద్వైపాక్షిక సిరీస్‌లను గెలిచినా.. అతని ఖాతాలో మేజర్ టైటిల్ లేకపోవడం ఆశ్యర్యకరం.చదవండి: 'అక్కడుంది టీమిండియా.. కాస్త జాగ్రత్తగా ఆడండి' ఒకవేళ ఈసారి భారత్‌లో జరిగే మేజర్ టోర్నీలను గెలవకపోతే కెప్టెన్ పదవి నుంచి కోహ్లి దిగిపోవాల్సిందే. కోహ్లి లేకున్నా టీమిండియా సిరీస్‌లు గెలవగలదని ఆసీస్ పర్యటనతో నిరూపితమైంది. కోహ్లి గైర్హాజరీలో రహానే సారధ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోపీని 2-1తేడాతో గెలవడమే ఇందుకు నిదర్శనం. రహానేకు వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ మంచి సపోర్ట్ ఇచ్చాడు.ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ను గెలిచేందుకు దోహదపడింది. దీన్నిబట్టి చూస్తే కోహ్లి నుంచి కెప్టెన్సీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.'అంటూ తెలిపాడు.చదవండి: ఐపీఎల్: రిటైన్ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం కాగా ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో ఇంగ్లండ్ నాలుగు టెస్టులు.. మూడు వన్డేలు.. 5 టీ20లు ఆడనుంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది -
బాల్ ట్యాంపరింగ్ ఇలా చేసే వాడిని..!
లండన్: తాను క్రికెట్ ఆడే సమయంలో బాల్ ట్యాంపరింగ్ చేసే వాడినంటూ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నుంచి పూర్తిగా మద్దతు ఉండేందంటూ కొత్త వివాదానికి తెరలేపాడు. 2006-13 మధ్య కాలంలో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పనేసర్.. ట్యాంపరింగ్ చేయడానికి సన్ స్ర్కీన్ లోషన్స్‌తో పాటు తన ప్యాంటుకు ఉన్న జిప్‌ను ఉపయోగించే వాడినన్నాడు. కొన్ని సమయాల్లో చూయింగ్ మింట్లతో కూడా బంతి ఆకారాన్ని చెడగొట్టడానికి యత్నించేవాడినన్నాడు. ఈ విషయాల్నితన రాసిన ‘ ద ఫుల్ మోంటీ’ పుస్తకం ద్వారా బయటపెట్టాడు. సాధ్యమైనంత వరకూ బంతిని పొడి బారేలే చేయడానికి ఈ విధానాల్ని ఉపయోగించే వాడినని, తాను బంతి ఆకారాన్ని ఎలా దెబ్బతీయాలనే విషయంలో పేసర్ జేమ్స్ అండర్సన్ సహకరించే వాడన్నాడు. ఇలా తాను చేసిన తర్వాత బంతి రివర్స్ స్వింగ్‌కు తోడ్పటమే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చాడు. ఆపై అండర్సన్ తరహా పేసర్లకు బంతి నుంచి రివర్స్ స్వింగ్ లభించేదంటూ పనేసర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తరఫున 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పనేసర్ 167 వికెట్లు సాధించగా, 26 వన్డేలకు గాను 24 వికెట్లు మాత్రమే తీశాడు. క్రికెట్ లా మేకర్ ఎంసీసీ నిబంధనల ప్రకారం బంతి ఆకారాన్ని కావాలని దెబ్బ తీయడం నేరం. ఐసీసీ 42.3 నియమావళి ప్రకారం ఇలా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ తాజా వివాదంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. -
పాక్ మ్యాచ్‌లో కోహ్లి సత్తా చాటుతాడు!
తాజాగా జరిగిన ఐపీఎల్లో భారత డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి పెద్దగా రాణించలేదు. ఐపీఎల్లో ఆడిన పది మ్యాచుల్లో 30.80 సగటుతో 308 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లి మరోసారి పుంజుకొని.. తన సత్తా ఏమిటో చూపే అవకాశముందని ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. కోహ్లి ఐపీఎల్లో అంచనాల మేరకు రాణించలేదని, కాబట్టి చాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాడని మాంటీ చెప్పాడు. "ఇండియాకు టోర్నమెంటు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్లో కోహ్లి గొప్పగా ఆడలేదు. కాబట్టి సహజంగానే అతడు ఈ టోర్నమెంటులో బాగా ఆడాలన్న ఆకలితో ఉంటాడు. కోహ్లి కీలక ఆటగాడు. పెద్ద టోర్నీల్లో బాగా ఆడటాన్ని ఇష్టపడతాడు. టీమిండియాకు మ్యాచ్ విన్నర్ అయిన అతను ఇంగ్లండ్‌లోనూ బాగా రాణిస్తాడని నేను భావిస్తున్నా' అని చెప్పాడు. జూన్ 4న బిర్మింగ్‌హామ్‌లో బద్ధ విరోధి పాకిస్థాన్ మ్యాచ్‌తో భారత్ చాంపియన్స్ ట్రోపీ వేటను ప్రారంభించబోతున్నది. పాకిస్థాన్‌తో జరిగే ఈ పోరుతో కోహ్లి తనలోని బెస్ట్ గేమ్‌ను చూపిస్తాడని, మళ్లీ ఫామ్‌లోకి వచ్చి సత్తా చాటుతాడని పనేసర్ అన్నాడు. -
విరాట్ సేనకు చెక్ పెడతాడా?
సిడ్నీ:వచ్చే నెల్లో భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తమ ప్రణాళికల్ని వేగవంతం చేసింది. భారత్‌లో టీమిండియాపై ఎలా ఆడితే నెగ్గుకు రాగలమో?అనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఇంగ్లండ్ మాజీ లెఫ్టార్మ్ స్సిన్నర్ మాంటే పనేసర్‌ను ఆసీస్ జట్టుకు మెంటర్(సలహాదారు)గా నియమించింది. 2012-13 సీజన్లో భారత్‌పై సిరీస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో సభ్యుడైన పనేసర్ సేవల్ని ఆసీస్ ఉపయోగించుకోనుంది. ఆ సిరీస్‌లో పనేసర్ 17 వికెట్లు తీసి భారత్ ను కంగుతినిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. అతన్ని మెంటర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వారంలో ఆసీస్ జట్టుతో పనేసర్ కలిసే యువ స్పిన్నర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. ప్రస్తుత ఆసీస్ జట్టులో స్పిన్నర్లకు పనేసర్ మెళుకువలు నేర్పనున్నట్లు ఆసీస్ హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ హోవార్డ్ తెలిపారు. ప్రధానంగా లెప్టార్మ్ స్పిన్నర్లైన స్టీవ్ ఓ కీఫ్, మాట్ రెన్షాలకు పనేసర్ సలహాలిస్తాడన్నారు. 'భారత్‌లో స్పిన్ బౌలింగ్‌పై పనేసర్‌కు మంచి అవగాహన ఉంది. స్పిన్‌ను ఆడేటప్పుడు బ్యాట్స్‌మెన్ ఎలా ఆలోచిస్తారు? అదే సమయంలో బౌలర్లు ఎలా బౌలింగ్ చేయాలి?అనే దానిపై పనేసర్ సేవల్ని ఉపయోగించుకోనున్నాం. పనేసర్ ఎంపిక మా జట్టుకు కలిసొస్తుందని ఆశిస్తున్నాం'అని హోవార్డ్ పేర్కొన్నారు. ఇంగ్లండ్ తరపున 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పనేసర్.. 2013-14 లో జరిగిన యాషెస్ సిరీస్‌లో చివరిసారి పాల్గొన్నాడు. అయితే ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 4-0 తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రధానంగా భారత్‌లో స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో విఫలమైన ఇంగ్లండ్ ఘోర ఓటమి పాలైంది. ఈ సిరీస్‌కు పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ సేవల్ని ఉపయోగించుకున్న ఈసీబీ.. తమ దేశ స్సిన్నర్ అయిన పనేసర్ ను పక్కను పెట్టేసింది. కాగా, ఆసీస్ మాత్రం ఇంగ్లండ్ ఓటమిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది. భారత్ లో విరాట్ సేనకు గట్టి పోటీ ఇవ్వాలంటే అటు సుదీర్ఘ బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా ప్రధానమని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇంగ్లిష్ స్పిన్నర్ పనేసర్‌ను స్పిన్ కన్సెల్టెంట్ గా ఎంపిక చేసింది. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న విరాట్ అండ్ గ్యాంగ్‌కు పనేసర్ చెక్ పెడతాడా?లేదా?అనేది చూడాలంటే కొంత సమయం ఆగాల్సిందే. ఫిబ్రవరి నెలలో ఆసీస్-భారత్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరుగనుంది. -
మందు కొట్టిన మత్తులో...
లండన్: అప్పట్లో సైమండ్స్ తప్పతాగడం... చిందులేయడం... చేపలు పట్టడం... ఇది సహించని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆగ్రహంతో సైమండ్స్ జట్టులో స్థానాన్నే కోల్పోయాడు. ఇటీవల జెస్సీ రైడర్ (కివీస్), వార్నర్ (ఆసీస్)లు బ్యాటింగ్‌లో మెరుపులకన్నా, తాగితూగిన ఉదంతాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రైడర్ అయితే ఏకంగా ప్రాణాల మీదికే తెచ్చుకున్నాడు. అదృష్టం ఆశపెట్టడంతో బ్రతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు. తాజాగా ఇప్పుడు ఇంగ్లండ్ స్పిన్నర్ మోంటీ పనేసర్ వంతు వచ్చినట్లుంది. అనుచిత ప్రవర్తనతో పోలీసులకు జరిమానా కట్టాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే... సోమవారం బ్రింగ్టన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో ఈ ఇంగ్లండ్ స్పిన్నర్ పీకలదాకా తాగేశాడు. ఆ నిషా తలకెక్కి ఒళ్లుమరిచాడు. క్లబ్‌కొచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడు. వాళ్ల ఫిర్యాదుతో బౌన్సర్లు అతన్ని ఈడ్చుకెళ్లి బయటికి గెంటేశారు. అసలే ఫూటుగా తాగడం... ఏం చేస్తున్నాననే ఇంగితం మరచిన పనేసర్... ఆ బౌన్సర్లపై మూత్ర విసర్జన చేశాడు. ఈ అసహ్యమైన ఘటన పోలీసుల దాకా వెళ్లింది. వార్నింగ్ ఇచ్చి, రూ.8300 (90 పౌండ్లు) జరిమానా విధించారు. దీనిపై సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ విచారణకు ఆదేశించింది. ఆ క్రికెటర్ ప్రతినిధి జరిగిన ఘటనపై పనేసర్ క్షమాపణ కోరాడని చెప్పారు.